Viral News: ప్రేమ అనే పదం దేనికీ పరిమితం కాదు. ఔను.. యువతీ యువకుల మధ్య ఉండే అనుబంధమే ప్రేమ అనుకుంటే పొరపాటే. తల్లి తన బిడ్డపై చూపేది కూడ ప్రేమ. ఓ తండ్రి తన సంతానంపై చూపేది ప్రేమనే. కానీ సంధర్భాన్ని బట్టి ప్రేమ అర్థం మారుతుంది. అంతేకానీ ఈ సమాజంలో అనుక్షణం ప్రేమకు చోటు ఉంటుంది. కొందరు మొక్కలపై ప్రేమ చాటుకుంటారు. మరికొందరు పక్షులు, జంతువులకు ప్రేమను పంచుతారు. అలా ఓ చిన్నారి.. రామచిలుకలతో పెంచుకున్న ప్రేమ, వాలంటైన్స్ డే సంధర్భంగా వైరల్ గా మారింది. ఇదిరా అసలైన ప్రేమ అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
చక్కగా మాటలు కూడ రాని చిన్నారి. ఎప్పుడు చూసినా ఆమె చుట్టూ రామచిలుకలు కనిపిస్తాయి. ఆ చిన్నారి తింటున్నా, అవి ప్రక్కన ఉండాల్సిందే. చిన్నారి బుడిబుడి అడుగులు వేసినా, ఆ రామచిలుకలు వెంట నడవాల్సిందే. మొత్తం మీద ఆ రామచిలుకలకు అన్నీ తానై ఉంటోంది చిన్నారి. ఆ చిలుకలు కూడ చక్కగా మాటలు కూడా రాని చిన్నారి మాటకు ఊ కొట్టేస్తున్నాయి.
తలపై ఒకటి, రెండు చేతులకు రెండు, భుజాలపై ఒక రామచిలుక.. ఎప్పుడు చూసినా చిలకలతో చిన్నారి సావాసం చేస్తోంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రేమ అనేది అందరూ అనుకున్నట్లుగా కొంత వరకే పరిమితం కాదని, ఇది కూడ ప్రేమే అంటున్నారు పక్షి ప్రేమికులు.
మాటలు రాని చిన్నారి పలుకులు వింటూ.. స్వచ్చమైన ప్రేమను పక్షులు చాటి చెబుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. సుమారు 5 సంవత్సరాల చిన్నారి, రామచిలుకలతో ఉండే వీడియోలను వరుసగా చిన్నారి కుటుంబ సభ్యులు పోస్ట్ చేస్తున్నారు. అదేదో చిన్న రామచిలుకలు అనుకుంటే పొరపాటే. ఎగిరే సామర్థ్యం ఉన్నా కూడ చిన్నారి వెంటే అడుగులు వేస్తూ నిజమైన ప్రేమను చాటి చెబుతున్నాయి ఆ పక్షులు. ఈ వీడియోలు వైరల్ అవుతుండగా వీరికి ఫాలోవర్స్ కూడ పెరిగారు.
యూట్యూబ్ లో anwar shah ustrana official అకౌంట్ ద్వార ఈ చిన్నారి వీడియోలను అప్లోడ్ చేస్తుండగా, వ్యూస్ మిలియన్స్ లో వచ్చేస్తున్నాయి. రామచిలుకలతో చిన్నారికి ఉన్న ప్రేమకు మన భారతీయులు కూడ ముచ్చటపడి తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ అనేది కొంత వరకే పరిమితం అనే వారికి, చిన్నారి పక్షుల మధ్య ఉన్న అనుబంధమే చక్కని ఉదాహరణ అంటూ పలువురు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు.
Also Read: Today Gold Rate: మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఎంతకు చేరిందంటే..?
వాలంటైన్స్ డే రోజు.. ఈ వీడియోలను పలువురు పోస్ట్ చేస్తూ.. ఇది అసలైన ప్రేమ.. మాటలు రాని చిన్నారితో ఆ పక్షుల అనుబంధం చూడండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి పక్షి ప్రేమికులు మన దేశంలో కూడ ఎందరో ఉన్నారు. వారందరికీ ప్రేమికుల రోజు సంధర్భంగా.. వారి పక్షి ప్రేమకు హ్యాట్సాఫ్ చెబుదాం.. మనం కూడ పక్షి జాతి అంతరించి పోకుండా.. మన వంతు భాద్యతగా ముందడుగు వేద్దాం.