E-Paper
Advertisement

సంగీత్ శోభన్ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ రిలీజ్!

సంగీత్ శోభన్ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ రిలీజ్!
Advertisement

Sangeeth Shoban:ప్రభాస్ (Prabhas), త్రిష (Trisha ) కాంబినేషన్లో వచ్చిన ‘వర్షం’ సినిమాకు డైరెక్టర్ గా, రచయితగా పనిచేసిన చిట్టజాలు శోభన్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సంగీత్ శోభన్ పిట్ట కథలు బ్యూటీ వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. తొలిసారి 2023లో మ్యాడ్ అనే చిత్రంతో హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ఉత్తమ పురుష అరంగేట్రం విభాగంలో ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్, రాకాస వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న సంగీత్ శోభన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘అంతా రాములోరి చూస్కుంటారు’.

‘అంతా రాములోరి చూస్కుంటారు’ మూవీ గ్లింప్స్ రిలీజ్..

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ మరో ఆసక్తికరమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో మాలీవుడ్ బ్యూటీ అన్నస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ గా నటిస్తోంది. గోదావరి ప్రాంతం నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ చూస్తుంటే మనసుకు హాయిని కలిగిస్తోంది. ముఖ్యంగా విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫీల్ గుడ్ మూవీ లా ఉండబోతోంది అనే విషయం అయితే గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి ప్రాంతం , అక్కడి సంస్కృతి, పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని చాలా అందంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫీల్ గుడ్ కథతో పాటు సహజమైన భావోద్వేగాలు ,పాత్రల మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Advertisement

also read:‘రాకా’లో పృథ్వీరాజ్.. ఏమన్నారంటే?

ఫీల్ గుడ్ మూవీ..

ఇకపోతే ఈ గ్లింప్స్ లో “మీట్ మారుతి.. నాట్ ఏ లవ్ స్టోరీ” అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్ మారుతి అనే పాత్రలో కనిపించనుండగా, అనస్వర రాజన్ శిరీష అనే పాత్రతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ (Palnati Surya Prathap) దర్శకుడిగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈయన తెరకెక్కిస్తున్న ఈ కొత్త కథపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

గోదావరి నేపథ్యంలో..

Advertisement

గోదావరి నేపథ్యంలో సాగే ఈ అందమైన కథకు మిక్కీ జే మేయర్ అందిస్తున్న సంగీతం మరింత బలంగా నిలుస్తోంది.. ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు రావు రమేష్ , రఘుబాబు , అలీ, వినోద్ కుమార్, ఝాన్సీ, రోహిణి, శివ నారాయణ, శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related News

డిజాస్టర్ హీరోయిన్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… సాహసం చేస్తున్న నందమూరి హీరో?

ఎన్టీఆర్–నీల్ మూవీ.. హైప్ ఎక్కువైపోతుందా?

‘రాకా’లో పృథ్వీరాజ్.. ఏమన్నారంటే?

విడుదలకు ముందే జైలర్ 2 సరికొత్త రికార్డ్.. భారీ ధరకు నాన్ థియేట్రికల్ హక్కులు!

చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

Big Stories

Advertisement
×