E-Paper
Advertisement

ప్రకాష్ రాజ్ పళ్లు రాలగొడతాం.. సైబర్ డీజీకి బీజేపీ నేతలు ఫిర్యాదు

ప్రకాష్ రాజ్ పళ్లు రాలగొడతాం.. సైబర్ డీజీకి బీజేపీ నేతలు ఫిర్యాదు
Advertisement

Cyber Complaint: హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని, అసభ్యకర పోస్టులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేతల బృందం అమరావతిలో సైబర్ సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌ను కలిసింది. టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డితో పాటు బిజెపి నాయకులు వల్లూరు జయప్రకాష్, షేక్ బాజీ, శ్రీనివాసరెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం ఈ మేరకు ఒక సమగ్రమైన ఫిర్యాదును అధికారులకు అందించింది. హిందూ మతాన్ని, ఆరాధ్య దైవాలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న 57 మంది వ్యక్తుల వివరాలను ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

హెచ్చరికలతో విరుచుకుపడ్డ భానుప్రకాష్ రెడ్డి

Advertisement

ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన సంస్కృతిలో శ్రీరాముడిని ఆరాధ్య దైవంగా, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, సీతమ్మ తల్లి వంటి దేవతా మూర్తులను కన్నతల్లులుగా భావించి పూజిస్తామని గుర్తుచేశారు. అటువంటి దేవుళ్లపై సోషల్ మీడియాలో కొందరు తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు చూస్తుంటే కంట్లో నీళ్లు వస్తున్నాయని, కడుపుకు అన్నం తింటున్నారా లేక మరేదైనా తింటున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ రకమైన అసభ్యకర పోస్టులు పెడుతున్న పాస్టర్లు, ఇతర వ్యక్తులకు తోలు తీస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

Advertisement

సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాష్ రాజ్ కొత్తగా హిందూ వ్యతిరేకిగా మారి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణానికి వచ్చి పళ్ళు దొంగిలించారంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఎక్కడైనా కనిపిస్తే పళ్ళు రాలిపోతాయంటూ తీవ్రంగా హెచ్చరించారు. కేవలం సోషల్ మీడియా టీఆర్‌పీ రేటింగ్స్, ఫాలోవర్స్ పెంచుకోవడానికే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ధైర్యముంటే ఇతర మతాల్లో ఉన్న అన్యాయాలపై మాట్లాడాలని, కేవలం హిందూ మతాన్నే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు.

సమర్పించిన ఆధారాలను పరిశీలించిన సైబర్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.

Also Read: కేంద్ర జలశక్తి, పర్యావరణ మంత్రులతో రేవంత్ భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులకి మోక్షం లభించేనా?

Tags

Related News

రూ. 3 వేల కోట్ల స్కామ్.. ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. షాకైన విశాఖ వైసీపీ నేత విజయప్రసాద్‌

వైసీపీలో అంతర్గత విభేదాలా? బోరుగడ్డ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, వెలుగులోకి కొత్త విషయాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, హైదరాబాద్‌లో కూడా

వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

ఢిల్లీ పార్లమెంట్‌లో భోగాపురం రచ్చ.. సీఎం చంద్రబాబుకు మంత్రి తనూజ రాణి సవాల్!

ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!

Big Stories

Advertisement
×