Big Stories

Break down of floating bridge: ఆదివారం ప్రారంభం.. సోమవారానికే తెగిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్..

floating bridge in vizag

- Advertisement -

Break down of floating bridge in vizag(Local news andhra Pradesh): విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం ప్రారంభించిన తేలే వంతెన సోమవారానికే తెగిపోవడం గమనార్హం. వంతెన చివరి భాగం తెగిపోయి 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. దీంతో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు పర్యాటకులు ఫ్లోటింగ్‌ బ్రిడ్జిను ఎక్కాలంటే భయపడే పరిస్థితులు ఏర్పాడాయి.

- Advertisement -

ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ బ్రిడ్డ్‌ను మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, పైసీపీ రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి కలిసి వైఎంసీఏ సమీపంలో ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్‌కు సుమారు రూ. కోటీ 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ సంస్థ నిర్మించింది.

ఈ బ్రిడ్జి నిర్మాణం జనవరి మొదటి వారంలో మొదలు పెట్టి ఫిబ్రవరి చివరికి అంటే కేవలం 45 నుంచి 50 రోజుల్లో పూర్తి చేశారు. ప్రాంభించిన రెండో రోజుకే తెగిపోవటంతో విమర్శలు గుప్పిస్తున్నారు. బీచ్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యటకులు సైతం భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని అధికారులపై మండిపడుతున్నారు.

Read More: Kolusu Parthasarathy : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. నూజివీడులో విజయంపై ధీమా..

ఈ బ్రిడ్జి నిర్మాణ దశలో ఉన్నప్పుడే నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నిర్మించారు. ఈ బ్రిడ్జి తెగిపోయి 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. ఈ సమయంలో అక్కడ పర్యటకులు ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలల తీవ్రత ఎక్కువ ఉన్న బీచ్‌లో తేలియాడే ఫోటింగ్‌ బ్రిడ్జిలు నిర్మించడం సరి కాదు అని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News