BigTV English

Nellore Road Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Nellore Road Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident in Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి-ముసునూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒక లారీని క్రాస్ చేయబోయిన కారు.. ముందు వెళ్తున్న మరో కారుని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందినవారుగా గుర్తించారు. మృతులు జ్యోతి కల్యాణ, రాజి, కుమార్ లుగా గుర్తించారు. వీరంతా చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి.. తిరిగి కొయ్యలగూడెంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.


Tags

Related News

Vangaveeti Statue: వంగవీటి రంగా విగ్రహం.. నిందితుడు దొరికాడు, వెనుక ఎవరున్నారు?

YS Jagan: బీజేపీకి దగ్గరై.. జగన్ సక్సెస్ అవుతాడా?

CM Chandrababu: నేతలను దులిపేసిన సీఎం చంద్రబాబు.. సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్య

Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!

CM Chandrababu: పెద్దాపురంలో కలకలం.. చంద్రబాబు కాన్వాయ్ ఆపిన భూమి బాధితుడు!

Kotamreddy Sridharreddy: ఇది నాకొక పాఠం.. ఇకపై పెరోల్ కోసం ఎవ్వరికీ లేఖలు ఇవ్వను

Big Stories

×