Big Stories

Priyanka attack on Modi: నాటకాలు ఆపు, మంగళసూత్రం విలువ మోదీకి ఏం తెలుసు

Priyanka attack on PM Modi:  సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఓ రేంజ్‌లో హీటెక్కింది. ముఖ్యంగా నేతల వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెళ్లువెత్తడంతో ప్రధాని నరేంద్రమోదీ డిఫెన్స్ పడిపోయారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ.

- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ ఏం మాట్లాడుతున్నారో తెలుసా అని ప్రశ్నించారు ప్రియాంకగాంధీ. అసలు ఆయన కు మంగళసూత్రం విలువ తెలుసా అని విమర్శించారు. దాని విలువ తెలీకుండా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ హత్య ఘటనను ప్రస్తావించిన ప్రియాంక, దేశం కోసం తన తల్లి సోనియా మంగళసూత్రాన్ని త్యాగం చేశారన్నారు. యుద్ధం సమయంలో సొంత బంగారాన్ని ఇందిరాగాంధీ దేశం కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ప్రజల బంగారం, మంగళసూత్రాలను దోచుకుందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

- Advertisement -

దేశంలో అన్ని సంప్రదాయాలకు మహిళ పునాది అని తెలిపారు ప్రియాంకగాంధీ. అవసరమైతే తాను ఆకలితో ఉండి.. కుటుంబంలో ఎవరినీ ఆకలితో ఉండకుండా చేస్తుందని తెలిపారు. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఇల్లాలు నిద్రపోతుందన్నారు. ఫ్యామిలీకి కష్టం వస్తే.. తన మెడలో ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి డబ్బులు తెస్తుందని, మహిళల త్యాగాల విలువ వీళ్లకేం తెలుసని ప్రధానిపై ఆగ్రహించారు. విలువలు మరిచి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు ప్రియాంకగాంధీ.

ALSO READ: రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ..

దేశ చరిత్రలో ఎన్నికల ముందు ఇద్దరు ముఖ్యమంత్రులను జైలుకు పంపిన ఘటనలు ఎప్పుడైనా చూశామా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు ప్రియాంకగాంధీ. నిజాలు ప్రశ్నించేవారిని ఇదేగతి పడుతుందన్నారు. మహిళలను బెదరగొట్టి ఓట్లు రాబట్టుకునేలా మాట్లాడుతున్న ప్రధాని మోదీ సిగ్గుపడాలన్నారు. అధికారం, నిజాయతీ.. ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కర్ణాటక వచ్చిన ప్రియాంకగాంధీ, చిత్రదుర్గ, బెంగళూరు, సౌత్ బెంగుళూరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగలో పాల్గొని ఆమె ప్రసంగించారు.

అసలేం జరిగిందంటే..

ఆదివారం రాజస్థాన్‌, సోమవారం యూపీలోని అలీగఢ‌ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల ఆస్తులు, బంగారాన్ని లాక్కుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ప్రజలకు ఓ హెచ్చరిక అంటూ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ప్రజల ఇళ్లు, బంగారంపై కన్నేశాయని, అధికారంలోకి వస్తే.. మీ ఆస్తి, బంగారాన్ని అందరికీ పంచుతామని ఆ పార్టీ చెబుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు మోదీ.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News