Big Stories

CSK vs LSG Highlights IPL 2024: చెన్నై కొంప ముంచిన ఆఖరి ఓవర్ .. గెలవదనుకున్న మ్యాచ్ గెలిచిన లక్నో

Chennai Super Kings vs Lucknow Super Giants IPL 2024 Highlights: ఓడలు బళ్లు అవుతుంటాయి. బళ్లు ఓడలు అవుతుంటాయని అంటుంటారు. ఇప్పుడు కొత్త డైలాగ్ ఏమిటంటే కూజాలు చెంబులు అవుతాయ్ అనే మాట ఇలాంటిదే.  చెన్నై వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో అంత పెద్ద స్కోరు.. చివరికి చిన్నదైపోయిందని ఫన్నీగా నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై రుతురాజ్ సెంచరీతో 20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో అనూహ్యంగా విజయం సాధించింది. మార్కస్ స్టొయినిస్ అజేయ సెంచరీతో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

- Advertisement -

అయితే 211 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. పరుగులేమీ చేయకుండానే క్వింటన్ డికాక్ వికెట్ పడిపోయింది. తర్వాత మరో ఓపెనర్ కెప్టెన్ రాహుల్ (16) కూడా ఎంతో సేపు నిలవలేదు. 4.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 33 పరుగులతో ఏటికి ఎదురీదుతూ లక్నో కనిపించింది.

ఈ సమయంలో వచ్చిన మార్కస్ స్టోయినిస్ అద్భుత సెంచరీ సాధించాడు. 63 బంతుల్లో 6 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో 124 పరుగులు చేయడమే కాదు నాటౌట్ గా నిలిచాడు. తర్వాత వచ్చిన వడిక్కల్ (13) అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ మాత్రం చివర్లో ఆడాల్సిన ఆటను ఆడాడు. 15 బంతుల్లో 34 పరుగులు చేశాడు. దీపక్ హుడా కూడా 6 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇలా ఒకవైపున స్టోయినిస్ కి వీరు అండదండలు అందించారు. దీంతో తను విజయ లక్ష్యాన్ని సులువుగా పూర్తి చేశాడు.

Also Read: రోహిత్ తర్వాత అతనికే పగ్గలివ్వాలి: హర్భజన్ సింగ్

గెలవదని అనుకున్న లక్నో అనూహ్యంగా ముందడుగు వేసింది. నిజానికి చివరి నాలుగు ఓవర్లలో 54 పరుగులు కావాలి. అందరూ అసాధ్యమనే అనుకున్నారు. అయితే లక్నో జట్టు ఓవర్ కి 20, 16 ఇలా చేసుకుంటూ వచ్చారు. చివరికి 12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఆ ఓవర్ లో పతిరణ 15 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది.

ముస్తాఫిజుర్ బౌలింగ్ కి వచ్చాడు. తనేమనుకున్నాడో తెలీదు. కనీసం వైడ్ బాల్స్ వేసి, బ్యాటర్ మైండ్ ని డైవర్ట్ చేయకుండా డైరక్టుగా బ్యాట్ మీద వేయడంతో వరుసగా స్టొయినిస్ 6, 4,4 కొట్టాడు. ఈ క్రమంలో మూడో బాల్.. నో బాల్ పడింది.

తీరా చూస్తే చివరికి 2 పరుగులు 4 బంతులుగా సమీకరణాలు మారిపోయాయి. ఇంకేం ఉంది. 3 బంతికి మరో ఫోర్ కొట్టి లక్నోని స్టొయినిస్ గెలిపించాడు. ముస్తాఫిజుర్ కొంప ముంచాడు. ఇంక ఏం చెప్పుకున్నా తక్కువే అనాలి. అంటే ఒక్క ముస్తాఫిజుర్ నే కాదు, ఇతర బౌలర్లు కూడా అలా వేయడం వల్లే కదా, అంత స్కోరుకి వచ్చారని నెటిజన్లు అంటున్నారు.

చెన్నై బౌలింగులో పతిరణ 2, ముస్తాఫిజుర్ 1, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు. అయితే దీపక్ 2 ఓవర్లు వేసి కేవలం 11 పరుగులే ఇచ్చాడు. మళ్లీ తనకి బౌలింగు ఇవ్వలేదు. మరేం జరగిందో తెలీదు. అలాగే రవీంద్ర జడేజా కూడా 2 ఓవర్లు వేసి 16 పరుగులే ఇచ్చాడు. తనకీ ఇవ్వలేదు. మరి ఇది కెప్టెన్సీ వైఫల్యామా? ఏమిటి? అని నెట్టింట పెద్ద డిబేట్ జరుగుతోంది.

Also Read: ముంబై డేంజర్ బెల్స్.. మూసుకుపోతున్న ప్లే ఆఫ్ దారులు

అంతేకాదు చెన్నయ్ ఫీల్డర్లు క్యాచ్ లు డ్రాప్ చేయడం కూడా కొంప ముంచింది. ఫీల్డింగ్ కూడా అస్సలు బాగాలేదు. బౌండరీ లైన్ల దగ్గర ఫోర్లను వదిలేశారు. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు చెన్నయ్ ఓటమికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నయ్ సూపర్ కింగ్స్ కి ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ ఆజ్యింకా రహానే (1) వెంటనే అయిపోయాడు. అయితే మరో ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడాడు. 60 బంతుల్లో 3 సిక్సర్లు, 12 ఫోర్లతో 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

తర్వాత డేరియల్ మిచెల్ (11), రవీంద్ర జడేజా (16) నిరాశ పరిచారు. కానీ వారి తర్వాత వచ్చిన శివమ్ దుబె మాత్రం చిచ్చర పిడుగులా చెలరేగాడు. 27 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

లక్నో బౌలింగులో మాట్ హెన్రీ 1, మొహ్సిన్ ఖాన్ 1, యశ్ ఠాగూర్ 1 వికెట్టు పడగొట్టారు.

విచిత్రం ఏమిటంటే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న చెన్నయ్ ని వెనక్కి నెట్టిన లక్నో ముందడుగు వేసింది. ఐపీఎల్ 2024 సీజన్ లో తొలిసారి చెన్నయ్ ఐదో స్థానంలో కనిపించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News