BigTV English

CBI: వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ.. అబద్దాన్ని సున్నా నుంచి 100 చేసే ప్రయత్నం: అవినాశ్‌రెడ్డి

CBI: వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ..  అబద్దాన్ని సున్నా నుంచి 100 చేసే ప్రయత్నం: అవినాశ్‌రెడ్డి

CBI: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు అతడిని విచారించారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినవన్నీ చెప్పానని అవినాశ్ రెడ్డి వివరించారు. వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా ఓ వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుపుతున్నారని ఆరోపించారు. ఒక అబద్దాన్ని సున్నా నుంచి 100 చేసే ప్రయత్నం చేస్తున్నారని.. అలాగే ఒక నిజాన్ని 100 నుంచి సున్నా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ విచారణకు పిలుస్తామని సీబీఐ చెప్పలేదన్నారు.


ఇక ఈ హత్యకేసులో అవినాష్ రెడ్డి పాత్రే కీలకమని సీబీఐ అనుమానిస్తోంది. అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి ప్రమేయం కూడా ఉందని భావిస్తోంది. వివేకా హత్య కేసులో అవినాస్ రెడ్డిని తొలిసారి జనవరి 28న సీబీఐ ప్రశ్నించింది. ఆ సమయంలో హైదరాబాద్‌ కోఠిలోని కార్యాలయంలో సీబీఐ అధికారులు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా తొలి విడత సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకు ముందు తర్వాత రెండు ఫోన్ నంబర్లు అవినాష్ వాడినట్లు గుర్తించారు. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌ నంబర్లకు కాల్‌ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తర్వాత కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్ ను కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో సీబీఐ దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది.


వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న, అవినాశ్‌రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సీబీఐ ఈ నెల 18న నోటీసులు ఇచ్చింది. 23న హాజరుకాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. అవినాశ్‌ రెడ్డి మాత్రం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూ వివేకా హత్య కేసు బిగుస్తోంది. తాజాగా కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో సీబీఐ తండ్రికొడుకుల ప్రమేయం ఆధారాలను పొందుపర్చింది. ఈ కోణంలో దర్యాప్తు చేస్తోంది. హత్యకు 40 కోట్లకు డీల్ జరిగిందని అభియోగాలు మోపింది. ఆ దిశగా మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. మరి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారా?

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×