BigTV English

Chandrababu comments: మహిళలూ జాగ్రత్త, జగన్ వస్తే ఆస్తులకు శఠగోపం

Chandrababu comments: మహిళలూ జాగ్రత్త, జగన్ వస్తే ఆస్తులకు శఠగోపం

Chandrababu comments: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తులకు శఠగోపం పెట్టడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన మనుషులను పెట్టుకుని భూముల రికార్డులు లేకుండా చేసేందుకు ప్లాన్ జరుగుతోందన్నారు.


ఒకరి పేరు మీద ఉన్న భూములను మరొకరి పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేస్తే సాక్షాలు కూడా ఉండవన్నారు చంద్రబాబు. రేపటి రోజున డిపార్టుమెంట్‌ను రద్దు చేస్తే.. మన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై మహిళలంతా చర్చించుకోవాలని సూచన చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్పకాదన్నారాయన. అందుకు తాను ఏదో గొప్పలు చేసినట్టు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు జీవితాలతో చెలగాట మాడిన జలగ సైకో జగన్ అని విమర్శించారు. ప్రజల జీవితాలను తలకిందు చేసిన దద్దమ్మ ప్రభుత్వ ఇదేనని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కేవలం 19 రోజులు మాత్రమే ఉందని, ఆ పార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


ALSO READ: బాబు నుంచి చింతమనేనికి ఫోన్, అందుకేనా?

మే 13న ఫ్యాన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపి వేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఫించన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబానికి భవిష్యత్తు గ్యారెంటీ లభిస్తుందన్నారు.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×