BigTV English

Ys sharmila sensational comments: షర్మిల సంచలన కామెంట్స్, వివేకా హత్య, ఆపై 40 కోట్లు

Ys sharmila sensational comments: షర్మిల సంచలన కామెంట్స్, వివేకా హత్య, ఆపై 40 కోట్లు

Ys sharmila sensational comments: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న‌కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా వివేకానంద హత్య గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో 40 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు సంచలన వ్యాఖ్యలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.


వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలు, ఫోన్ రికార్డులతోపాటు డబ్బు చేతులు మారినట్టు సాక్షాలున్నా ప్రభుత్వం ఐదేళ్లగా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేని ప్రశ్నించారు షర్మిల. కడప జిల్లా కమలాపురంలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన ఆమె, అంత డబ్బు ఎవరి దగ్గర ఉంటుందని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి కాకపోతే ఎవరు చంపినట్టు? వెనుక ఎవరున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుకుని అవినాష్‌రెడ్డిని కాపాడుతున్నారని దుయ్యబట్టారామె. దీనిపై సీఎం జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. ఏడుసార్లు గొడ్డలితో నరికితే వివేకా ఎముకలు బయటకు వచ్చాయని సీబీఐ చెబుతోందన్నారు. ఇళ్లంతా రక్తమయినా సాక్షి ఛానెల్‌లో మాత్రం హార్ట్‌ఎటాక్ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పత్రిక నడుపుతున్నది జగన్ భార్య కాదా? అని ప్రశ్నించారు. ఈ లెక్కన వివేకా హత్య కేసులోకి వైఎస్ భారతిని కూడా లాగేశారు వైఎస్ షర్మిల.


ఇప్పటికే పులివెందుల నియోజకవర్గాన్ని చుట్టేసిన వైఎస్ భారతి, కుటుంబసభ్యులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని ప్రచారంలో వివరించా రు. ఒకవేళ మీడియా గుచ్చిగుచ్చి వివేకా కేసు గురించి అడిగినా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ALSO READ: ఆ సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. చక్రాలు లేవు, పెడల్స్ లేవు: జగన్

వివేకా హత్య తర్వాత పులివెందుల రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు అభిమానంలో ఓట్లు రాబట్టు కుంటే, ఇప్పుడు బెదిరింపులతో ఓట్లు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కొంతమంది దిగువస్థాయి నేతలు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. మరికొందరు రెడీ అవుతున్నారు. వాళ్ల విషయం తెలుసుకున్న వివేకా హత్య కేసులోని కొందరు నిందితులు హైదరాబాద్ నేరుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పులివెందుల అంతఃపురం గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×