BigTV English

Jagan govt given highest ads to sakshi: జగన్ లెక్కలు బయటకు.. సాక్షికి రూ.403 కోట్లు, మిగతా 20 పేపర్లకు..

Jagan govt given highest ads to sakshi: జగన్ లెక్కలు బయటకు.. సాక్షికి రూ.403 కోట్లు, మిగతా 20 పేపర్లకు..

Jagan govt given highest ads to sakshi: వైసీపీ ప్రభుత్వంలోని కుంభకోణాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కో‌ శాఖ గురించి కీలక విషయాలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. తాజాగా గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నుంచి సాక్షికి ప్రకటన రూపంలో 403 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సమాచారశాఖ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో వెల్లడించారు.


ఈ వ్యవహారంపై హౌస్‌కమిటీ వేసి విచారణ చేయిస్తామన్నారు మంత్రి పార్థసారథి. దీనికి కారణమైన అధికారులను రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి మొత్తం డేటాను సభలో పెట్టారు. ఐదేళ్లలో ఒక్క సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు 403 కోట్లు. మిగతా 20 పత్రికలకు  ఇచ్చిన ప్రకటనలు రూ. 488 కోట్లు.

జగన్ ఐదేళ్ల పాలనలో వివిధ పత్రికలకు చేసిన ఖర్చు. ఈనాడు- రూ. 190 కోట్లు, సాక్షి రూ.293 కోట్లు, ఆంధ్రజ్యోతి- రూ.21 లక్షలు, ఆంధ్రప్రభ-14.5 కోట్లు, వార్త-13.71 కోట్లు, ప్రజాశక్తి-11.11 కోట్లు, హిందూ- 41 కోట్లు, న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్-30.03 కోట్లు, డీసీ-రూ. 40 కోట్లు, హాన్స్‌ఇండియా రూ.-7 కోట్లు, పయనీర్ – 9 కోట్లు రూపాయల యాడ్స్ ఇచ్చినట్టు తేలింది. డిజిటల్ యాడ్స్ ఐఎన్పీఆర్ పరిధిలో లేదన్నారు మంత్రి.


ALSO READ:  ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫైర్ లెస్ బ్రాండ్.. పత్తా లేని మాజీ మంత్రి రోజా

ఎక్కువ సర్కులేషన్లు ఉన్న పత్రికలకు జగన్ ప్రభుత్వంలో మొండిచేయి చూపినట్టు మంత్రి వెల్లడించిన వివరాల్లో బయటపడింది. ఇంకో కొత్త విషయం ఏంటంటే.. ప్రకటనలపై ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ వేసింది. కొన్ని పత్రికలకు పేమెంట్ పెండింగ్‌లో పెట్టారు. దీంతో వాళ్లు ప్రభుత్వ ప్రకటనలు తీసుకోలేదన్నది అసలు మేటర్. సచివాలయాల్లో సాక్షి పేపరు తీసుకోవాలన్న జీవో తమ శాఖ ఇవ్వలేదన్నారు.

ఇదిలావుండగా కేంద్రం నుంచి డిప్యుటేషన్‌ మీద ఏపీకి వచ్చారు పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డి. ప్రభుత్వం మారడంతో ఆయన కేంద్రసర్వీసులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన మీద వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేయించాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. తాజాగా ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×