BigTV English

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Durga temple: తిరుమల లడ్డూ వివాదం ముగియక ముందే దుర్గ టెంపుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడిలో నాసిరకం సరుకులపై వినియోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతోంది.


వైసీపీ హయాంలో చేసిన పనులు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు వచ్చే దేవాలయాల్లో ప్రసాదాలు నాసిరకంగా ఉండడంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వ్యవహారంపై దేవాదాయ శాఖలో అంతర్గత విచారణ జరుగుతోంది. రెండురోజుల తనిఖీల్లో రూ. 15 లక్షల రూపాయల విలువైన నాసిరకం సరుకులు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముఖ్యంగా అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్‌లో పని చేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు పాటించకపోవడంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఉద్యోగులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో రిపోర్టు ఆ శాఖ అందనుంది. ఆ తర్వాత విజిలెన్స్ విచారణ చేయిస్తుందా? అనేది తెలియాల్సివుంది.

ALSO READ: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

ఇదేకాకుండా అటు అన్నవరం, సింహాచలం దేవాలయాల్లో ఇదే సమస్య తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి రాగానే అన్నవరం దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. నెయ్యిను తనిఖీకి పంపించారు. దానిపై రెండురోజుల్లో నివేదిక రానుంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×