BigTV English

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

CM Chandrababu Meet in NTR Dist: సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు విరాళంగా రావడం చరిత్ర అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడ్డామని చెప్పారు.


రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి వరద బాధితులకు సహాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు పెద్ద మొత్తంలో స్పందించారని, భారీగా విరాళాలు ప్రకటించారన్నారు.. వరద సమయంలో అందరం సమన్వయంతో పనిచేశామన్నారు. అధికారులతో పాటు నేను కూడా బురదలో దిగినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

వరదల సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద విపత్తు జరిగిన సమయంలో అందరూ ఏకతాటిపైకి రావడం హర్షణీయమన్నారు. ఒకవైపు నుంచి వరద ఉప్పొంగి వస్తుండగా.. మరోవైపు నుంచి బుడమేరు నీరు పోటెత్తిందన్నారు. ఈ సమయంలో అధికారులతో పాటు తాను స్వయంగా పర్యటించానని వెల్లడించారు.


చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 42సెం.మీల వర్షం పడిందని చంద్రబాబు చెప్పారు. దీంతోపాటు ఊహించని రీతిలో బుడమేరు వరద ముంచెత్తిందని వెల్లడించారు. గత పాలకులు చేసిన పాపాలు శాపాలుగా మారాయని చంద్రబాబు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం గండ్లు పూడ్చకపోవడంతో వరద వచ్చిందన్నారు. అక్రమ కట్టడాలు కూడా వరదలకు కారణమని చెప్పారు.

Also Read: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

ప్రజల్లో మనోధైర్యం నింపామని వెల్లడించారు. సుమారు 4 లక్షల మందికి 602కోట్లు నేరుగా బాధితుల ఖాతాల్లోకి విడుదల చేశామని చెప్పారు. వరదల్లో 7వేల 600 కోట్ల నష్టం జరిగిందన్నారు. సమస్య తీవ్రంగా ఉందని, నేను ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×