BigTV English

CM Chandrababu new advisors: చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త సలహాదారులు, కాకపోతే..

CM Chandrababu new advisors: చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త సలహాదారులు, కాకపోతే..

CM Chandrababu new advisors (AP political news) : చంద్రబాబునాయుడు కేబినెట్ కొలువు దీరింది. ప్రతి శాఖకు సమర్థు లైన అధికారులను నియమించుకున్నారు. మరికొందర్ని డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి రప్పించారు. కానీ ఎక్కడ సమస్య సీఎం చంద్రబాబును వెంటాడుతోంది. అదే సలహాదారుల సమస్య. సలహాదారులగా ఎవర్ని తీసుకోవాలనే దానిపై రకరకాల ఆలోచనలు. రాజకీయ నేతలను తీసుకుంటే వైసీపీ తరహాగా తయారవు తుందని భావిస్తున్నారు. దీంతో ఐఐఎం స్టూడెంట్స్‌పై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టినట్టు ప్రభుత్వ వర్గా లు చెబుతున్నాయి.


ఏ రాష్ట్రప్రభుత్వాలైనా  నార్మల్‌గా ఐఏఎస్ అధికారులపై ఆధారపడతాయి. ఒక్కోసారి ఆయా అధికారులు తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ అవుతాయి. ప్రభుత్వానికి ఊహించని డ్యామేజ్ జరుగుతుంది. అలాంటి సందర్భాలు లేకపోలేదు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కొంతమంది ఐఐఎం స్టూడెంట్స్ తీసు కోవాలని ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. మంత్రివర్గంలోని ప్రతీ మంత్రికి సహకరించేందుకు వీరి సేవల ను ఉపయోగించుకోవాలన్నది అసలు ప్లాన్.

ఐఐఎంల్లో చదివినవారిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట సీఎం చంద్రబాబునాయుడు. వారికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్‌గా ప్రతీ శాఖలో నియమించాలని భావిస్తున్నారు. మంత్రుల పేషీల్లో పని చేసే అధికారులకు పరిపాలన వ్యవహారాల్లో వీరంతా సహాయం చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదిన నియ మించుకోవాలన్నది ఆలోచన. సంబంధిత మంత్రి శాఖల సమస్యలను వీరు అధ్యయనం చేయనున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రజలకు మెరుగైన పాలనను అందించేలా సలహాలు సూచనలు ఇవ్వనున్నారు.


గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది ఐఐఎం విద్యార్థులను సలహాదారులుగా నియ మించుకున్న విషయం తెల్సిందే. ప్రభుత్వ పాలసీలపై వారికి అవగాహన ఉంటుంది. అవి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే దానిపై వీరు దృష్టి సారించనున్నారు.

ALSO READ: మదనపల్లె ఫైల్స్ కేసు, పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..

వైసీపీ ప్రభుత్వం చాలామందిని సలహాదారులను నియమించుకుంది. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందు కు చాలామందికి సరైన అవగాహన లేదు. కనీసం కేబిన్ కూడా లేదు. వారంతా సచివాలయానికి వచ్చిన సందర్భాలు లేవు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం నుంచి ప్రతీ నెల లక్షల్లో జీతాలు తీసుకునేవారు. అందుకు భిన్నంగా పరిపాలనలో తన మార్క్ చూపించాలనే తనపతో ఉన్నారు సీఎం చంద్రబాబు.

Related News

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Big Stories

×