BigTV English

Chandrababu naidu: “ఎన్నికల ముందు ముద్దులు.. తర్వాత పిడి గుద్దులు..” జగన్ పై చంద్రబాబు సెటైర్లు..

Chandrababu naidu: “ఎన్నికల ముందు ముద్దులు.. తర్వాత పిడి గుద్దులు..” జగన్ పై చంద్రబాబు సెటైర్లు..

Chandrababu naidu: రాష్ట్రంలో ఎవ్వరికీ ధైర్యంగా మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇది ఏం ప్రజాస్వామ్యం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరాచకాలు ఎక్కువ అయ్యాయి, రాష్ట్రాన్ని నియంతృత్వంగా పాలిస్తుస్తారని ద్వజమెత్తారు. వైసీపీలో 11 మంది ఇన్‌ఛార్జులను మార్చారు, 151 మందిని మార్చినా వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థతి లేదన్నారు . అప్పుడే వైకాపాలో ప్రకంపనలు మొదలయి, ఎన్నికల ముందు ముద్దులు.. ఇప్పుడేమో పిడి గుద్దులు.. జగన్ అపరిచితుడిలా ప్రవర్తిస్తాడు చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి అన్నారు.


రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, పోలీసులతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వెనకబడిన వర్గాలను బలపరిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని.. కానీ జగన్ అనగారిక వర్గాలను పట్టించుకునే పరిస్థతి ఏం మాత్రం కనిపించడంలేదన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.. మరి ఇప్పుడు హోదా ఏమయ్యిందని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశామని తాము అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లమన్నారు. పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయన్నారు. కానీ వైసీపీ పాలనలో పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక సంప్రదాయాలను సర్వనాశనం చేశారన్నారు. జగన్ కి అమ్మ, చెల్లినే కలిసే సమయం ఉండదు. ఇక రాష్ట్ర ప్రజలను ఎప్పుడు కలుస్తారని విమర్శించారు. జగన్ కి ప్రతిపక్షాల మీద దాడి చేయడం తప్పా , రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం తెలియదన్నారు.


తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ కార్యాలయం కళకళలాడింది.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×