Intinti Ramayanam Today Episode October 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో అవని ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చిన వ్యక్తి అక్కడికి వస్తారు. మీరు 50 లక్షలు కోసం ఈ ఇంటిని నా పేరు మీద రాశారు మీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను.. ఇంటిని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అంటాడు.. నేను కోట్లు విలువ చేసే ఇంటిని 50 లక్షలు కోసం నీకెందుకు రాసిస్తాను అని అవని అంటుంది. ఆ కాగితలో అలానే రాసి ఉంది కదా మరి మీరు కచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు.. అవని నేను నిజంగా అప్పుడు చేసినప్పుడు వేరేలా ఉంది మామయ్య ఇప్పుడు వేరేలా ఉంది అని అంటుంది. ఇంట్లోని పరిస్థితులను బట్టి రాజేంద్రప్రసాద్ తలుచుకొని గుండెల్లో నొప్పి వస్తుంది అంటూ గుండెపోటు తెచ్చుకుంటాడు.. ఇంట్లోనే వాళ్ళందరూ హాస్పిటల్ కి తీసుకెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… రాజన్నప్రసాద్ కి గుండెపోటు రావడంతో అందరూ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు.. అయితే డాక్టరు ఆయన కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలాగైనా సరే దేవుడు ఆయన్ని కాపాడాలి అని పార్వతీ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఆ టైంలో అక్కడికి పల్లవి వస్తుంది. అవని ఇన్ని తప్పులు చేసినా కూడా మీరు ఆమెని నెత్తిన పెట్టుకున్నారు. ఇంట్లోంచి గెంటే లేదేంటి? అత్తయ్య నువ్వు చంపాలని చూసింది అయినా కూడా మీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండి పోయారు. నేను చేసింది తప్పేలా అవుతుంది? నీ భార్య గురించి నువ్వు అర్థం చేసుకుని ఇంతేనా అని కమల్ ని అడుగుతుంది. ఇంత జరిగినా కూడా అవని అంటే ఏంటో మాకు తెలుసు నీ గురించి కూడా మాకు అర్థం అయిపోయింది. నువ్వు ఇక నుంచి వెళ్ళమ్మా అని పార్వతి పల్లవి చంప పగలగొడుతుంది.
అవని ఎంతగా మోసాలు చేసిన సరే మీరు ఆమెని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. నీ భార్యని కనీసం నువ్వు దగ్గరికి రానివ్వట్లేదు చూసావా అని కమల్ తో అంటుంది. డాక్టరు అక్కడికొచ్చి ఆయన కండిషన్ సీరియస్ గా ఉంది ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా హాస్పిటల్ అనుకుంటున్నారా అని సీరియస్ అవుతాడు. దాంతో పల్లవిని కమల్ ఇకనుంచి వెళ్లిపోని అంటాడు. డాక్టర్ వచ్చి ఆయన కండిషన్ ఇంకా క్రిటికల్ గా మారుతుంది వెంటనే స్టంట్ చేయాలి అని అంటారు.
వెంటనే మీరు 500000 రెడీ చేసుకోండి అని డాక్టర్ చెప్పగానే అందరూ టెన్షన్ పడతారు.. అంత డబ్బులు మా దగ్గర ఎక్కడివి అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడేం చేయాలి రా అక్షయ్ అని పార్వతి బాధ పడుతూ ఉంటుంది. శ్రియ అవని ఇంటిని అమ్మేయాలని చూస్తుంది అందరిని రోడ్డు మీద పడేయాలనిశ్రియ అవని ఇంటిని అమ్మేయాలని చూస్తుంది అందరిని రోడ్డు మీద పడేయాలని చూసింది. మావయ్య గారు ఆపరేషన్ కి నేను డబ్బులు ఇస్తాను ఇదిగోండి నాకు క్రెడిట్ కార్డు అని శ్రియ డబ్బులు ఇస్తుంది. దాంతో ఆపరేషన్ సక్సెస్ అవుతుంది..
Also Read : రోహిణి పై మీనాకు అనుమానం.. ప్రభావతి హ్యాపీ.. బాలుకు నిజం తెలుస్తుందా..?
రాజేంద్రప్రసాద్ చూడడానికి పార్వతీ లోపలికి వెళ్తారు. రాజేంద్రప్రసాద్ బాగానే ఉన్నారు అని డాక్టర్ చెప్తారు. అవని అక్షయ్ ఇద్దరు కూడా రాజేంద్రప్రసాదం చూసి సంతోషపడతారు. ఇంట్లో గొడవలు జరుగుతుంటే ఎవరైనా ఎలా మనశ్శాంతిగా ఉంటారు నా పరిస్థితి కూడా అంతే కమలు పిచ్చోడు.. గొడవలతో భార్యని దూరం చేసుకోవాలని చూసాడు వాడి గురించి నా టెన్షన్ అంతా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. వాళ్ళిద్దర్నీ కలిపే బాధ్యత మాది ఎలాగోలాగా మేము కలుపుదాం మావయ్య అని అంటుంది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ని ఇంటికి తీసుకుని వెళ్తారు. అందరూ రాజేంద్రప్రసాద్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు నేను బాగానే ఉన్నాను అని అంటారు… పల్లవి తను అనుకున్న మనిషిని అక్కడికి పంపిస్తుంది. మీకు ఇచ్చిన గడువు పూర్తయింది మీరు ఇంటిని కాళీ చేయాలని అతని చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..