Illu Illalu Pillalu Today Episode October 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ధీరజ్ కి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను ఆగలేను ధీరజ్ కి నా మనసులోని మాటను బయట పెట్టాలి. ఏం చేయాలన్నా సరే నేను ధీరజ్ ని వదలను. ఈ ప్రేమని కచ్చితంగా ధీరజ్ కి తెలిసేలా చేయాలి అని ఆలోచిస్తూ తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. ధీరజ్ కోసం కొన్న ఒక లాకెట్ ని ధీరజ్ కి ఇవ్వాలని అనుకుంటుంది. దాని ద్వారా తన ప్రేమను వ్యక్త పరచాలని అనుకుంటుంది. ధీరజ్ ని దూరంగా ఉండటం చూసి ప్రేమ అక్కడికి వెళ్లి నువ్వంటే నాకు చెప్పలేని ప్రేమ అన్నట్లు మాట్లాడుతుంది.. నువ్వు చెయ్యి పట్టుకోవడం చూసిన ధీరజ్ విశ్వం నీ దారుణంగా కొడతాడు. దాంతో ప్రేమ ధీరజ్ మధ్య దూరం పెరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భద్ర విశ్వం దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు అని అడుగుతుంది.. ప్రేమ ధీరజ్ల మధ్య పెరుగుతున్న దూరం గురించి నేను ఆలోచిస్తున్నాను అని విశ్వం అంటాడు. ప్రేమ ధీరజ్ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అన్నమాట నీ పదేపదే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ నన్ను ఇన్ని మాటలు అంటాడా అని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.. అటు ధీరజ్ కూడా మంచి వాళ్ళు కూడా మర్డర్ చేస్తారంటే అందుకేనేమో.. ఇంత కోపమేంటి అని తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు…
ప్రేమ నేనన్న మాటలకి ఎంత బాధపడిపోయిందో… ఎక్కడుందో తెలుసుకొని సారీ చెప్పాలి అని అనుకుంటాడు. ప్రేమ బాధపడుతుంటే అక్కడికి వెళ్లి నేను కోపంలో అన్నాను సారీ అని అంటాడు. ఆ మాట వినగానే ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకు పిచ్చి తో పాటు కాళ్లకు చక్రాలు కూడా ఇచ్చారు.. స్పీడ్ గా పరిగెడుతున్నావ్ ఏంటి ఆగవే అని ధీరజ్ వెనకాలే పరిగెడతాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ మాటలని వినకుండా ముందుకు వెళుతుంది. ధీరజ్ చేతికి దెబ్బ తగిలిందని తెలుసుకొని ప్రేమ అక్కడున్న ఒక క్లాత్ ని తీసుకొని అతను చేతికి కడుతుంది.
నీకు కోపంతో పాటు పిచ్చి అన్నీ కూడా ఉన్నాయి కాస్త మంచి దానివి కూడాను అని ధీరజ్ అంటాడు. నేను కోపంలో అన్నని అవన్నీ పట్టించుకుంటావా? అయితే నీ కోపం తగ్గకపోతే నన్ను కొట్టు అని ధీరజ్ అనగానే ప్రేమ చెంప పగలగొడుతుంది. అదేంటే 32 పనులు ఒకేసారి రాలిపోయి అంత గట్టిగా కొట్టావు అని ధీరజ్ అంటాడు. ఇద్దరూ కలిసిపోయినట్లు అనిపిస్తుంది.. ఇక భాగ్యం ఆనందరావు డబ్బులు చాలా వచ్చాయని సంబరపడిపోతూ ఉంటారు.. డబ్బులను సరదాగా లెక్క పెడుతూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేసి రేపు మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలని మా మామయ్య ఒక్క మాటలో ఆర్డర్ వేశాడు. తప్పకుండా రావాలి అని అంటుంది.
మావయ్యకి ఏం పని లేదా ఎప్పుడు చూసినా అక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటారు మాకు ఎన్ని పనులు ఉంటాయి మా బిజినెస్ ఏమవుతుంది ఆలోచించాడా అని భాగ్యం అంటుంది. పెళ్లయితే చేశాం కానీ దినదినం మనకి టెన్షన్ తప్పట్లేదు అని భయపడుతూ ఉంటాడు.. బొచ్చు పీకేసిన పాము మీద కుర్చీ వేసుకుని కూర్చున్నట్లు రోజు ఇదే టెన్షన్ అని భయపడుతూ ఉంటాడు. ఇక వేదవతి చపాతీలు చేస్తూ ఉంటుంది.. తిరుపతి సహాయం చేస్తూ అలాగే వేదవతికి చురకలెంటిస్తూ ఉంటాడు. వేదవతి తన కోపాన్ని తిరుపతిపై చూపిస్తుంది.
Also Read: రచ్చ చేసిన పల్లవి.. కమల్ కోలుకోలేని షాక్.. రాజేంద్రప్రసాద్ కండీషన్ సీరియస్..
ఇక రామరాజు కోపంగా ఉంటాడు. శ్రీవల్లి వాళ్లని ఇరికిందామనుకుంటే నాకు కొంపకి నిప్పు అంటుకునింది ఏంటి అని బాధపడుతూ.. భయపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నర్మద విషయంలో పుల్ల పెట్టాలి అని శ్రీవల్లి ధైర్యం చేసుకొని రామరాజు దగ్గరికి వస్తుంది. అక్కడికి సాగర్ రావడం చూసి సాగర్ వచ్చాడు కదా ఇక కచ్చితంగా ఈ గొడవ పెద్దదవుతుంది అని అనుకుంటుంది. అయితే సాగర్ నాన్నగారు అని పిలుస్తాడు కానీ రామరాజు పలక పోవడంతో వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీవల్లి సాగర్ నీకు కావాలని పిలిచి మామయ్య గారిని మీ మామయ్య అవమానించాడు అంటూ అంటుంది.. మొత్తానికి శ్రీవల్లి పుల్ల పెట్టి నిప్పంటి చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..