BigTV English

Mudragada: పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ముద్రగడ..

Mudragada: పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ముద్రగడ..

Kapu Leader MudragadaKapu Leader Mudragada (today’s state news): ఏపీ కాపునేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవి బాటలోనే నడుస్తారని అన్నారు.


ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారని ముద్రగడ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి అతి కొద్ది కాలంలోనే పార్టీ జెండాను లేకుండా చేశారని అన్నారు. జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో పయనిస్తాడని అన్నారు.

రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా జనసేన అధినేత కేవలం 20 సీట్లకే పరిమితం అవ్వడం శోచనీయం అని అన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పవన్ కళ్యాణ్ పార్టీని పెడితే తాను వెళ్లి చేరాల అంటూ ప్రశ్నించారు. కేవలం 20 సీట్ల కోసం పవన్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటే చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. గతంలో చంద్రబాబు తనకు అనేక ఇబ్బందులకు గురి చేశారని ముద్రగడ గుర్తు చేసుకున్నారు. అలాంటి చద్రబాబుతో చేతులు కలిసిన పవన్ కళ్యాణ్ ఓటమికి తాను పనిచేస్తానన్నారు.


Also Read: MLA Eliza: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

ఉద్యమం వల్ల తాను చాలా కోల్పోయానని ముద్రగడ అన్నారు. పవన్ కళ్యాణ్ కాపుల కోసం ఇప్పుడు ఉద్యయం చేయవచ్చు కదా అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.చిరంజీవి ఓడిపోయాడని, పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల ఓడిపోయారని గుర్తు చేశారు. జగన్ కు పవన్ కు చాలా తేడా ఉందన్నారు. రాష్ట్రంలో మరో 30 సంవత్సరాల పాటు జగన్ సీఎంగా ఉంటారని అన్నారు.

Related News

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

Big Stories

×