300 People Kidnaped in Kuriga: ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన 300 మంది పాఠశాల విద్యార్థులను బందీలు ఎట్టకేలకు విడుదల చేశారు. ఈ మేరుకు స్థానిక అధికారులు ఆదివారం విద్యార్థుల విముక్తి గురించి తెలిపారు.
కడునా లోని కురిగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి మార్చి 7న ముష్కరులు దాదపు 300 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. దీన్ని అడ్డుకున్న ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అపహరించిన పాఠశాల విద్యార్థులను దగ్గర్లోని అడవులకు తీసుకెళ్లారు. బూటీగా 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నైజీరియా అధ్యక్షుడు టినుబు పిల్లలను ఒక్క పైసా చెల్లించకుండి విడుదల చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చెప్పినట్టుగానే ఒక్కపైసా చెల్లించకుండా కిడ్నప్‌కు గురైన వారందరినీ విడిపించారు.
కుడునా గవర్నర్ టినుబు తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా ఏజెన్సీలు తీసుకున్న వ్యూహాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. నైజీరియా భద్రతా సలహాదారు దగ్గరుండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారని కొనియాడారు. వారి చొరవతోనే పిల్లలు బయటకు వచ్చారని వెల్లడించారు.
Also Read: నైజీరియాలో స్కూల్స్‌పై ముష్కరుల దాడి.. 280 మంది విద్యార్థుల కిడ్నాప్..
నైజీరియాలోని పాఠశాలల నుండి పిల్లలను కిడ్నాప్ చేసిన అతివాద సంస్థ బోకో హరామ్ పదేళ్ల క్రితం ఈశాన్య బోర్నో రాష్ట్రంలోని చిబోక్‌లోని పాఠశాల నుంచి 276 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. వారిలో కొంతమంది ఆడవారిని ఇప్పటికీ విడిపించలేదు.
కాగా నైజీరియా విద్యార్థులను కిడ్నాప్ చేసి డబ్బును డిమాండ్ చేయడం సర్వ సాధారణమైంది. ఎలాంటి క్రయధనం చెల్లించకుండా పిల్లల్ని విడిపించడంతో నైజీరియా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.