BigTV English

iPhones @Below Rs 20,000: అమెజాన్ హోలీ ఆఫర్.. రూ. 20,000 లోపే ఐఫోన్ 15, 14 plus, 13, 12

iPhones @Below Rs 20,000: అమెజాన్ హోలీ ఆఫర్.. రూ. 20,000 లోపే ఐఫోన్ 15, 14 plus, 13, 12
iphone 13
iphone 13

Get iPhone 15, 14 plus, 13, 12 at Below Rs 20,000 in Amazon Holi offers: ఐఫోన్స్ అంటే ఇష్టం లేనివారంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటుంటారు. అయితే అధిక ధరల కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటుంటారు. ఎప్పుడైన ఫెస్టివల్స్ లేదా మరేదైన టైంలో ఐఫోన్లపై ఆఫర్లు ఉంటే కొనుక్కోవచ్చులే అని అనుకుంటారు.


అలా ప్లాన్ చేసుకునే వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్. ఐఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లతో మరింత తక్కువ ధరలోనే ఐఫోన్‌ను కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. అదెలా అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు ఈ డీల్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రంగు రంగుల పండుగ హోలీ వచ్చేసింది.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే యాపిల్​ ఐఫోన్లపై సూపర్ డూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఐఫోన్​ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నవారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఐఫోన్ 12 నుంచి ఐఫోన్ 15 వరకు ప్రతి మోడల్‌కు సంబంధించిన ఆఫర్‌ను ఇప్పుడు అమెజాన్‌​లో తెలుసుకుందాం.


Also Read: 5జీ ఫోన్ కొంటే కాస్ట్‌లీ ఇయర్ బడ్స్ ఫ్రీ.. అదనంగా భారీ డిస్కౌంట్ కూడా..

1. ఐఫోన్ 15:

ఐఫోన్ 15పై అమెజాన్‌లో సూపర్ డూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 128 జీబీ అసలు ధర రూ.79,900గా ఉంది. అయితే ఇప్పుడు ఈ వేరియంట్‌ని కేవలం రూ.71,290కే కొనుక్కోవచ్చు. అంటే ఐఫోన్ 15పై దాదాపు 11శాతం భారీ డిస్కౌంట్ లభిస్తోందన్న మాట.

అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.4000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.33,050 తగ్గింపు వస్తుంది. అప్పుడు ఈ ఐఫోన్ 15ను కేవలం రూ.38,240లకే కొనుక్కోవచ్చు అన్నమాట.

2. ఐఫోన్ 15 ప్రో ​:

ఐఫోన్​ 15 ప్రో 128జీబీ అసలు ధర రూ.1,34,900గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫోన్‌ను ఇప్పుడు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ధరపై అమెజాన్ 5 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపుతో దీనిని రూ.1,27,990కే కొనుక్కోవచ్చు.

దీనిపై కూడా పలు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుపై రూ.3000 వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఈ ఆఫర్లు కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్‌పై రూ.33,050 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువకే ఈ ఫోన్ లభిస్తుంది.

Also Read: అమెజాన్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీమియర్ లీగ్ సేల్.. రూ.11వేల లోపు టాప్ 5G మొబైల్స్ ఇవే..!

3. ఐఫోన్ 14 ప్లస్..

అమెజాన్‌లో ఐఫోన్ 14 ప్లస్ 128 జీబీ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.89,900గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్ దీనిపై 25 శాతం తగ్గింపు అందిస్తోంది. అప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.66,999లకే లభిస్తుంది.

దీనిపై ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేవు. కానీ భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఏకంగా రూ.33,050 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఐఫోన్ 14 ప్లస్ రూ.33,949లకే లభిస్తుంది.

4. ఐఫోన్ 13:

ఐఫోన్ 13 (128జీబీ) వేరియంట్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో ఐఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌ అనే చెప్పాలి.

ఐఫోన్ 13 అసలు ధర రూ.59,900గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై అమెజాన్ 12 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపుతో దీనిని కేవలం రూ.52,900లకే కొనుక్కోవచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఏకంగా రూ.33,050 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.

అప్పుడు ఐఫోన్‌ను కేవలం రూ.19,850లకే కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. అయితే పాత ఫోన్ కండీషన్ మంచిగా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ పూర్తి మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు.

5. ఐఫోన్ 12:

ఐఫోన్ 12 అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీనిని ఎవ్వరైనా కొనుక్కోవచ్చు. దీని 64 జీబీ వేరియంట్ ధర రూ.65,900 ఉండగా.. ఇప్పుడు 32 శాతం తగ్గింపుతో రూ.44,999లకే అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Also Read: 5జీ ఫోన్‌పై రూ.41 వేల భారీ డిస్కౌంట్.. ఇప్పుడు రూ.3,999లకే కొనుక్కోవచ్చు..

అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా భారీ ఎకక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది.

దీనిపై కూడా రూ.33,050 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే.. ఐఫోన్ 12ని రూ.11,949లకే సొంతం చేసుకోవచ్చు అన్నమాట. ఒక రకంగా చూస్తే ఐఫోన్ 13, ఐఫోన్ 12ను బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట.

Tags

Related News

Brain SuperComputer: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి

Call Transcribe Pixel: పాత పిక్సెల్ ఫోన్‌లలో కొత్త ఫీచర్.. కాల్ ట్రాన్స్‌క్రైబ్.. ఎలా చేయాలంటే?

Pixel 10 Pro Alternatives: పిక్సెల్ 10 ప్రో కంటే బెటర్? టాప్ కెమెరా ఫోన్లు ఇవే..

AI Security Robots: సెక్యూరిటీ రోబోలు.. ఇండియాలో వచ్చేస్తున్నాయ్.. మీరు కొనుగోలు చేస్తారా?

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. ఇక ఈ 6 ఆపిల్ ప్రొడక్స్ కనిపించవా?

iphone 17 Price: ఐఫోన్ 17 సిరీస్ త్వరలోనే లాంచ్.. ఇండియాలో ధరలు ఇవే

Big Stories

×