BigTV English

Chandrababu : టీడీపీ-జనసేన గాలి వీస్తోంది.. అందుకే జగన్ స్వరం మారింది..

Chandrababu : ఏపీలోవైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన రా.. కదలిరా.. బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరో 74 రోజుల్లో ఏపీకి పట్టిన శని పోతుందన్నారు. ఓటమి ఖాయమని తెలిసే సీఎం జగన్ మాటల్లో తేడా వచ్చిందన్నారు. పదవి నుంచి సంతోషంగా దిగిపోతానని అంటున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఉరవకొండకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఇక్కడ టీడీపీ-జనసేన గాలి వీస్తోందన్నారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే సీఎం వైఎస్ జగన్‌కు నిద్ర పట్టదన్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సీట్లను టీడీపీ-జనసేన కూటమి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో ప్రతి వ్యవస్థ నష్టపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా 30 ఏళ్లు వెనక్కి పోయిందని తెలిపారు. అనంతపురం జిల్లాకు నీరు ఇస్తే బంగారం పండిస్తారని పేర్కొన్నారు. ఈ జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనేది తన లక్ష్యమని చెప్పారు. రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా, కాలువల విస్తరణ పనులు చేశామన్నారు. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకురావాలని అనుకున్నామని తెలిపారు. 90 శాతం రాయితీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించామని చంద్రబాబు గుర్తు చేశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×