BigTV English

Chandrababu: మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి?

Chandrababu: మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి?

Chandrababu: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు.. 352 ఎంవోయూలు కుదిరాయని ప్రభుత్వం ప్రకటించింది. 15 విభాగాల్లో పరిశ్రమలు రానున్నాయని.. 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ చెప్పారు. సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందంటూ వైసీపీ వర్గమంతా ఫుల్ ఖుషీగా ఉంది. అయితే, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరు ప్రస్తావించకుండానే.. ప్రభుత్వంపై పంచ్‌లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులెలా వస్తాయని ప్రశ్నించారు. విశాఖలో రూ.40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.


ఇక, వైసీపీ దౌర్జన్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. సీఎం జగన్ అరాచకాల నుంచి.. ఎంపీ రఘురామ, సుబ్బారావు గుప్తా లాంటి వైసీపీ నేతల్ని కూడా టీడీపీయే కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారపార్టీ అరాచకాల దెబ్బకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని.. ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రావణ కాష్టం తరహా పరిస్థితులు నెలకొంటే.. టీడీపీ లీగల్‌ సెల్‌ అందుకు ధీటుగా పని చేస్తోందని ప్రశంసించారు చంద్రబాబు.

విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. నాలుగేళ్లలో పార్టీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చించారు. నారాలోకేశ్‌ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులపై సమావేశంలో చర్చ జరిగింది. పాదయాత్రలో లోకేశ్‌పై 12 కేసులు పెట్టారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులు, పోలీసులను వదలబోమని చంద్రబాబు హెచ్చరించారు. పొలిటికల్‌ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామని అన్నారు.


ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమకేసులు బనాయించే పోలీసులను ఉపేక్షించేది లేదని, చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాల్సిందేని మండిపడ్డారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×