BigTV English

Chandrababu in Kovvur Prajagalam: వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం.. కొవ్వూరు ప్రజాగళంలో చంద్రబాబు..!

Chandrababu in Kovvur Prajagalam: వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం.. కొవ్వూరు ప్రజాగళంలో చంద్రబాబు..!
Chandrababu Naidu On YCP
Chandrababu Naidu On YCP

Chandrababu Naidu Speech in Kovvur Prajagalam: వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందని.. తండ్రి, బాబాయ్ పేరు మీద ఓట్లు అడుగుతున్నారని.. అలాంటి పార్టీ కావాలా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. కొవ్వూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు.


జగన్ విధ్వంస పాలన చేశారని.. ఏపీని సర్వనాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికే కూటమిగా జతకట్టామని తెలిపారు.

వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని .. కానీ ఒక ప్రభుత్వ వ్వవస్థ రాజకీయ పార్టీకి మద్దతు తెలపరాదని.. కేవలం ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్వవస్థను కొనసాగిస్తామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇచ్చే వీలు సచివాలయ సిబ్బందికి ఉందని.. అయినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.


వైసీపీ ప్రభుత్వం పెన్షను ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రూ. 4వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎండలో సచివాలయానికి వెళ్లడం వలన ఒకరిద్దరు చనిపోయారని.. ఇలాంటి సంఘటనలు జరగకుండా పెన్షన్‌లు ఇవ్వాలని కోరారు.

Also Read: ఏపీలో వలసల జోరు.. వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైసీపీ నేతలు గొడ్డలితో ప్రజలను భయపెడ్తున్నారని.. ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలి గుర్తు పెట్టుకోవాలని జగన్‌కు సూచించారు. ఫ్యాన్‌ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రైతు కూలీల ప్రస్తావన తీసుకొచ్చిన టీడీపీ అధినేత.. తాము అధికారంలోకి వస్తే రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. అటు పేదప్రజలకు రెండు సెంట్ల భూమి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×