BigTV English

Katamreddy Vishnuvardhanreddy Joins YSRCP: ఏపీలో వలసల జోరు.. వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Katamreddy Vishnuvardhanreddy Joins YSRCP: ఏపీలో వలసల జోరు.. వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
CM Jagan invite Nellore Tdp EX mla katamreddy vishnuvardhan reddy joining ysrcp
CM Jagan invite Nellore Tdp EX mla katamreddy vishnuvardhan reddy joining ysrcp

Katamreddy Vishnuvardhanreddy Joins YSRCP: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో నేతలు చేరికలు జోరందుకున్నాయి. టికెట్లు రాని నేతలు పార్టీలు మార్చేస్తున్నారు. ఈ జాబితాలో అధికార వైసీపీ-విపక్ష టీడీపీలు పోటీ పడుతున్నాయి. కాకపోతే టీడీపీ కంటే వైసీపీ నుంచే వలసలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.


గురువారం ఉదయం కాటంరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఆయనతోపాటు మద్దతుదారులు పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. దీంతో కావలి నియోజకవర్గంలో పార్టీలో బలోపేతం అవుతుందని వైసీపీ అంచనా. నేతల చేరికల సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి అక్కడే ఉన్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు విష్ణువర్థన్‌రెడ్డి. రీసెంట్‌గా టీడీపీ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో మిగతా పార్టీల వైపు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు రావడం, వెంటనే జాయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయింది.

2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. అక్కడ వైసీపీ చాలా బలంగా ఉండేది. కాకపోతే వైసీపీ అధిష్టానంతో విసిగిన నేతలు ఆ పార్టీకి రాంరాం చెప్పేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం వంటి నేతలు టీడీపీలోకి వెళ్లిపోయారు. వీరితోపాటు ఎంపీ వేంరెడ్డి కూడా  ఫ్యాన్ పార్టీకి దూరమయ్యారు. ఎప్పుడూ లేనంతగా ఆ జిల్లాలో వైసీపీ చాలా బలహీనపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఎంపీగా బరిలో దిగడంతో ఆ పార్టీ మరింత బలహీనపడింది. ఆ జిల్లాపై నేతలు పట్టుకోల్పోయారు.


ALSO READ: కిక్ ఎక్కేసింది.. పోలీసు వాహనం డ్యామేజ్.. చివరకు ఎలాగంటే

ముఖ్యంగా వైసీపీ నుంచి ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండడంతో ముందు అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో నేతల వలసలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Related News

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Minister Lokesh: రియల్ టైమ్ గవర్నెన్స్‌లో మంత్రి లోకేష్.. నేపాల్‌లో తెలుగువారితో వీడియో కాల్

AP Govt Plan: ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై నో ఆఫీసు, నేరుగా ఇంటికే

Big Stories

×