West Bengal High Court On Sandeshkhali Incident: సందేశ్‌ఖాలీలోని మహిళలపై లైంగిక వేధింపు ఆరోపణలకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్‌లోని విషయాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కలకత్తా హైకోర్టు గురువారం “కేసు ఒక్క శాతం నిజం అయినా, అది పూర్తిగా సిగ్గుచేటు” అని పేర్కొంది.
సందేశ్‌ఖాలీలో మహిళలపై హింస, భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం మమతా సర్కార్‌పై మండిపడ్డారు. “మొత్తం జిల్లా పరిపాలన, పాలక యంత్రాంగం నైతిక బాధ్యత వహించాలి. ఇది 1% నిజం అయినా అది పూర్తిగా సిగ్గుచేటు. మహిళలకు అత్యంత సురక్షితమైనదని పశ్చిమ బెంగాల్ చెబుతోంది కదా? ఒక అఫిడవిట్ సరైనదని రుజువైతే ఇవన్నీ పడిపోతాయి.” అని న్యాయమూర్తి దీదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్త చేశారు.
కాగా ఈ పిటిషన్లపై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుపాకీతో మహిళలను బెదిరించి.. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న దావాలు, సందేశ్‌ఖాలీలో గిరిజనుల భూమిని ఆక్రమించిన ఆరోపణలపై ఫిబ్రవరిలో హైకోర్టు సుమోటాగా విచారణ చేపట్టింది.
జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జరిగిన దాడితో పాటు ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ కస్టడీపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయాలని మార్చిలో ఆదేశించింది.
Also Read: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించండి.. ప్రభుత్వానికి బెంగాల్ హైకోర్టు ఆదేశం..
TMC నుంచి సస్పెండ్ అయిన జిల్లా పరిషత్ సభ్యుడు షాజహాన్ షేక్‌పై జనవరి 5 న రైడ్స్ చేయడానికి సందేశ్‌ఖాలీకి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షాజహాన్, అతని సన్నిహితులు పరారీలో ఉండటంతో, ఫిబ్రవరి 8న, స్థానిక TMC నాయకులపై లైంగిక వేధింపులు, దాడులు, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పాట్రాతో సహా పలు ప్రాంతంలోని మహిళలు వీధుల్లోకి వచ్చారు.