BigTV English

Chandrababu: సిలిండర్లు ఫ్రీ.. నిరుద్యోగ భృతి.. 20 లక్షల ఉద్యోగాలు.. CBN సూపర్ సిక్స్

Chandrababu: సిలిండర్లు ఫ్రీ.. నిరుద్యోగ భృతి.. 20 లక్షల ఉద్యోగాలు.. CBN సూపర్ సిక్స్

Chandrababu: రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తిరువూరులో నిర్వహించిన “రా..కదలిరా” సభలో చంద్రబాబు మహిళలకు బంపరాఫర్ ఇచ్చారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ గా ఇస్తానని హామీ ఇచ్చారు.


అలాగే.. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా, ఉచితంగా తిరిగే రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ మంచినీటిని అందించే బాధ్యత తమదన్నారు. ప్రతి మహిళ డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తానన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి.. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఊరిలో ఉన్న ఇంటిలోనే కూర్చుని.. ప్రపంచ కంపెనీల్లో పనిచేసే సదుపాయాన్ని కూడా కల్పిస్తామన్నారు. ఇంటిదగ్గర కూర్చుని పనిచేసే సదుపాయం లేనివారికోసం.. మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెడతామని తెలిపారు.

నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, అన్నదాత పదకం కింద రైతులకు ఏడాదికి రూ.20,000, వెనుకబడిన వర్గాల కోసం.. జయహో బీసీ కింద 140 కమ్యూనిటీలను బాగుచేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తామన్నారు. దళిత డ్రైవర్ ను చంపి.. డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకెళ్లిన ఈ ప్రభుత్వంది రాక్షస పాలనేనని దుయ్యబట్టారు. ఈ సూపర్ సిక్స్ హామీలే కాకుండా.. త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. ఏపీ ప్రజలంతా సైకో పోవాలి.. సైకిల్ రావాలంటున్నారని చంద్రబాబు చెప్పారు.


.

.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×