E-Paper
Advertisement

ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం ఇక 9 గంటలే.. కొత్త వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం ఇక 9 గంటలే.. కొత్త వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!
Advertisement

Delhi-Varanasi Vande Bharat Sleeper: న్యూఢిల్లీ-వారణాసి మధ్య కొత్త వందే భారత్ స్లీపర్ రైలును అక్టోబర్ 31న ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసి నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడవనుంది. రాత్రిపూట ప్రయాణించి మరుసటి రోజు ఉదయం గమ్యస్థానానికి చేరుకునేలా సమయాలను రూపొందించారు.

వందే భారత్ స్లీపర్ రైలు టైమింగ్స్ ఇవే..

ఈ రైలు రెండు దిశల్లోనూ ప్రత్యేక రైలు నంబర్లతో నడుస్తుంది. వారణాసి నుంచి న్యూఢిల్లీకి రైలు నంబర్ 27421తో ప్రారంభం అవుతుంది. ఈ రైలు వారణాసిలో రాత్రి 8:50 గంటలకు బయల్దేరుతుంది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ కు రాత్రి 10:35 గంటలకు చేరుతుంది. కాన్పూర్ సెంట్రల్ కు అర్ధరాత్రి 12:40 గంటలకు చేరుతుంది. న్యూఢిల్లీకి మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు చేరుతుంది. న్యూఢిల్లీ నుంచి వారణాసికి రైలు నంబర్ 27422తో బయల్దేరుతుంది. న్యూఢిల్లీలో రాత్రి 9:40 గంటలకు బయల్దేరుతుంది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ కు మరుసటి రోజు తెల్లవారుజామున 4:45 గంటలుకు చేరుతుంది. వారణాసికి ఉదయం 6:45 గంటల చేరుకుంటుంది. ఈ రైలు సుమారు 760 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల 5 నిమిషాల్లో ప్రయాణించనుంది. ప్రయాగ్‌ రాజ్, కాన్పూర్ సెంట్రల్ ప్రధాన స్టాపులుగా ఉంటాయి. చిపియానా బుజుర్గ్ దగ్గర టెక్నికల్ హాల్ట్ ఉంటుంది.

16 కోచ్‌లు.. 823 బెర్తులు..

Advertisement

ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికుల కోసం మూడు రకాల ఏసీ బెర్త్ సౌకర్యాలను అందిస్తున్నారు. ఫస్ట్ ఏసీ (1AC) 24 బెర్తులు, సెకండ్ ఏసీ (2AC) 188 బెర్తులు, థర్డ్ ఏసీ (3AC) 611 బెర్తులను కలిగి ఉంటుంది. మొత్తంగా 823 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఈ రైలును గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించినప్పటికీ, ఆపరేషనల్ వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లుగా నిర్ణయించారు.

టికెట్ ధరలు ఎంతంటే?

ఈ రైలులో ప్రయాణించేందుకు సాధారణ ఎక్స్‌ ప్రెస్ రైళ్లతో పోలిస్తే కొంత ఎక్కువ ఛార్జీ ఉండే అవకాశం ఉంది. ఎంత అనేది అధికారిక ప్రకటన తర్వాత తెలియనుంది. టికెట్ల బుకింగ్ కోసం IRCTC అధికారిక వెబ్‌ సైట్‌ ను పరిశీలించవచ్చు.

వందే భారత్ స్లీపర్‌కు పెరుగుతున్న ఆదరణ

Advertisement

ఇప్పటికే హౌరా-కామాఖ్య మార్గంలో ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ రైలుకు మంచి స్పందన లభిస్తోంది. మొదటి 119 ట్రిప్పుల్లోనే సుమారు 1.21 లక్షల మంది ప్రయాణించడం, 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదవడం ఈ రైళ్లకు ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-వారణాసి మార్గంలో కొత్త స్లీపర్ రైలు ప్రవేశపెట్టడం ప్రయాణికులకు మరో మంచి అవకాశంగా మారనుంది.

Read Also: బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!

Tags

Related News

చేతిలో ఐఫోన్.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని 17 ఏళ్ల బాలుడు బలి!

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. వందే భారత్ సహా 42 రైళ్లు రద్దు!

నల్లగొండలో యాక్సిడెంట్లకు చెక్.. నాలుగు లైన్లుగా సాగర్ రోడ్డు విస్తరణ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!

రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు.. 46 మంది మృత్యువాత!

Big Stories

Advertisement
×