Phone battery saving tips: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ పనులైనా, సోషల్ మీడియా రీల్స్ చూడాలన్నా.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడాలన్నా ఫాస్ట్ ఇంటర్నెట్ చాలా ముఖ్యం. అయితే.. ఎప్పుడైనా మీ ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ 20 శాతం కంటే.. తక్కువగా పడి పోయినప్పుడు ఇంటర్నెట్ ఒక్క సారిగా స్లో అయిపోవడం గమనించారా ? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోన్ బ్యాటరీకి, ఇంటర్నెట్ స్పీడ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా లేదా మ్యానువల్‌గా “పవర్ సేవింగ్ మోడ్” ఆన్ చేస్తాం. ఈ మోడ్ ఆన్ చేసినప్పుడు ఫోన్ తన బ్యాటరీ లైఫ్‌ను.. కాపాడుకోవడానికి బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయ్యే అనేక.. ప్రాసెస్‌లను ఆపేస్తుంది. ఇంటర్నెట్ డేటాను సింక్ చేసే.. యాప్‌లు, నోటిఫికేషన్‌లు, అలాగే వై-ఫై, మొబైల్ డేటా ప్రాసెసింగ్ వేగాన్ని కూడా ఇది తాత్కాలికంగా తగ్గిస్తుంది. దీని వల్ల ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించినట్లు అనిపిస్తుంది.
ఫోన్‌లో బ్యాటరీ చార్జ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ తన పూర్తి సామర్థ్యంతో పని చేయడాన్ని ఆపేస్తుంది. దీనిని టెక్నికల్ భాషలో.. “థ్రాట్లింగ్”అంటారు. బ్యాటరీ మీద ఎక్కువ భారం పడకుండా.. ఉండటానికి ప్రాసెసర్ స్పీడ్‌ను తగ్గిస్తారు. ఫోన్ ప్రాసెసర్ స్లో అయినప్పుడు, వెబ్ పేజీలు లోడ్ అవ్వడానికి, వీడియోలు స్ట్రీమ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే.. ఇంటర్నెట్ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది.
మన ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా “మోడమ్” చిప్ ఉంటుంది. ఫోన్ బ్యాటరీ లెవెల్స్ ..చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఫోన్ పవర్ మేనేజ్‌మెంట్.. సిస్టమ్ ఈ మోడమ్‌కు అందే పవర్‌ను కూడా తగ్గిస్తుంది. సిగ్నల్ ట్రాన్స్‌మిషన్ బలహీన పడటం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పడి పోతుంది. ముఖ్యంగా 5G నెట్‌వర్క్‌లో ఉండే ఫోన్లు ఎక్కువ బ్యాటరీని.. ఉపయోగిస్తాయి కాబట్టి, ఛార్జింగ్ తగ్గినప్పుడు 5G స్పీడ్ చాలా వరకు తగ్గి పోతుంది.
Also Read: తక్కువ ధరలో..సినిమా థియేటర్ మజా,టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ టీవీలివే!
మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పూర్తిగా క్షీణించిపోయి ఉంటే, ఫోన్ తరచూ లాగ్ అవ్వడం, ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడం జరుగుతుంది. మార్కెట్లో.. ఒరిజినల్ బ్యాటరీల ధరలు మోడల్‌ను బట్టి సుమారు రూ. 1,500 నుంచి రూ.3,500 వరకు ఉంటాయి. బ్యాటరీ పాడైపోయినప్పుడు ఫోన్ సరిగా పని చేయదు కాబట్టి, కొత్త బ్యాటరీని కొనడం చాలా మంచిది.
ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోక ముందే ఛార్జింగ్ పెట్టుకోండి.
అవసరం లేనప్పుడు బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆఫ్ చేయండి.
బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన.. యాప్‌లను క్లోజ్ చేయండి.
ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి. ఎందుకంటే వేడి వల్ల కూడా ప్రాసెసర్ స్లో అవుతుంది.
మొత్తానికి.. ఫోన్ బ్యాటరీ నేరుగా ఇంటర్నెట్ సిగ్నల్‌ను తగ్గించకపోయినా, బ్యాటరీ పవర్ తగ్గినప్పుడు ఫోన్ తీసుకునే సెల్ఫ్-ప్రొటెక్షన్ చర్యల వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. కాబట్టి మీ ఫోన్ బ్యాటరీని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకుంటే, హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఎలాంటి అడ్డంకులు లేకుండా వాడొచ్చు!