BigTV English

Chandrababu Tears up: ముంబైలో రతన్ టాటాకు నివాళులర్పించిన చంద్రబాబు… కంటతడి!

Chandrababu Tears up: ముంబైలో రతన్ టాటాకు నివాళులర్పించిన చంద్రబాబు… కంటతడి!

Ap CM Chandrababu Pays tributes to Ratan tata in Mumbai: ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ లో ఉంచి ఆయన పార్థిక దేహాన్ని సందర్శించి చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రతన్ టాటాతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


Also Read: రతన్ టాటాను తలుచుకుని కంటతడి పెట్టిన కేంద్రమంత్రి..

‘రతన్ టాటా మృతి యావత్ దేశానికి తీరని లోటు. రతన్ టాటా గొప్ప విజన్ ఉన్న వ్యక్తి. వికసిత్ భారత్ కోసం రతన్ టాటా ఎంతో కృషి చేశారు. 100 దేశాలల్లో ఆయన భారత దేశం గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆయనొక మంచి వ్యక్తి. సామాజం పట్ల గొప్ప బాధ్యత కలిగి ఉన్న వ్యక్తి. దేశ ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో రూపాల్లో రతన్ టాటా సేవలు అందించారు. లాస్ లో ఉన్న టాటా కంపెనీని తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చేశారు. ఆయన కంపెనీల ద్వారా సుమారుగా 10 లక్షల మందికి ఉపాధి కల్పించారు. తెలంగాణలో ఉన్న బసవతారకం ఆసుపత్రికి కూడా రతన్ టాటా హెల్ప్ చేశారు. ఏపీలోని ఓ ఆసుపత్రికి కూడా హెల్ప్ చేశారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివి. ప్రతి ఒక్క వ్యక్తి ఆయనను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. రతన్ టాటాను నేను పలు సందర్భాల్లో కలిశాను. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. రతన్ టాటాతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆనందం, ధైర్యం కలిగేది. ఎథికల్ బిజినెస్ చేసేందుకు రతన్ టాటా ఒక బెస్ట్ ఉదాహరణ. కేవలం వ్యాపార ధోరణితోనే కాకుండా సేవా దృక్పథంతో ఉన్న మహోన్నతమైన వ్యక్తి. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. ఎంతోమంది పేదవాళ్లకు, భారతీయులకు ఆయన సేవ చేశారు. అందుకే ఆయనకు దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.


Lokesh (Image Credit/X)
Lokesh (Image Credit/X)

సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి లోకేశ్ కూడా ముంబైకి వెళ్లి రతన్ టాటా పార్థివ దేహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని లోకేశ్ ప్రార్థించారు.

Also Read: భరతమాత ముద్దుబిడ్డకు భారతరత్న కోరుతూ మహా మంత్రిమండలి తీర్మానం

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×