BigTV English

Piyush Goyal: రతన్ టాటాను తలుచుకుని కంటతడి పెట్టిన కేంద్రమంత్రి..

Piyush Goyal: రతన్ టాటాను తలుచుకుని కంటతడి పెట్టిన కేంద్రమంత్రి..

Union Minister Piyush Goyal tears up on air: ప్రముఖ పారిశ్రామిక వేత్త, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రతన్ టాటా మృతి వార్త తెలిసి భారత దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రపంచంలోని ప్రముఖులు కూడా ఆయన మృతి పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా రతన్ టాటా కన్నుమూతపై స్పందించారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు.


Also Read: ‘మీ ఇండియన్స్‌కు కారు తయారీ గురించి ఏమీ తెలియదు’.. రతన్ టాటాకు అమెరికాలో ఘోర అవమానం!

సోషల్ మీడియాలో ప్రస్తుతం పలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. రతన్ టాటా గొప్ప తనం గురించి పీయూష్ గోయల్ చెబుతూ కన్నీరు కార్చారు. ‘చాలా రోజులు క్రితం రతన్ టాటా గారు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు మా ఇంట్లో ఆయన కేవలం దోస, ఇడ్లీ, వడ సాంబార్ ను మాత్రమే తీసుకున్నారు. ఆరోజు నాకు స్పష్టంగా అర్థమైంది. అదేమంటే.. రతన్ టాటా నిరాడంబరంగా ఉంటారని తెలిసింది. అందులోనే ఆయన ఆనందంగా ఉంటారు. అంతేకాదు.. ఆయన మంచి గుణం కూడా ఉంది. ఎదుటి వ్యక్తి భావాలు, ఆందోళనను కూడా ఆయన తెలుసుకోగలరు. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే ఆ రోజు మా ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు నా సతీమణి మనసులోని భావాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. వెంటనే మీరు.. నాతో ఫొటో తీసుకోవాలని అనుకుంటున్నారా? అని ఆమెను అడిగారు. ఎందుకంటే.. అంతమంచి వ్యక్తితో ఫొటో దిగాలని, కొన్ని నిమిషాలైనా గడపాలని చాలామంది ఆశిస్తుంటారు. ఆ మహనీయునితో గడిపిన ప్రతీ క్షణం ఓ మధురమైన జ్ఞాపకం’ అంటూ ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటాతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆరోజు పీయూష్ గోయల్ గుర్తుచేసుకుని కన్నీరుపెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి.


Also Read: చిన్న ఉద్యోగిగా చేరి.. టాటా కంపెనీకి అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిన రతన్ టాటా!

రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల యావత్ దేశం సంతాపం తెలియజేస్తుంది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో సహా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. రతన్ టాటా దేశానికి చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన పేరు చెప్పగానే ఎవరైనా సరే గౌరవంగా ఫీలవుతుంటారు. అంతలా ఆయన ప్రజల హృదయాల్లో చోటును సంపాదించుకున్నారు.

Also Read: బిజినెస్ కింగ్ టాటా గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే.. 69 ఏళ్ల వయస్సులో కూడా.. ?

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×