E-Paper
Advertisement

జగన్‌కు దిమ్మతిరిగేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్, ఇంప్లిమెంట్ అయితే, ఇక వైసీపీ అస్సామే?

జగన్‌కు దిమ్మతిరిగేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్, ఇంప్లిమెంట్ అయితే, ఇక వైసీపీ అస్సామే?
Advertisement

Chandrababu Master Plan: ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి చట్ట బద్దత కల్పించే రోజు మనసులోని ఆలోచనను బయటపెట్టారు జగన్. దీంతో మావిగన్‌కు తిరుగులేదని ఆ పార్టీ నేతలు పదే పదే మీడియా ముందు ఢంకా బజాయించారు. ఇంతవరకు బాగానే మరి అధికార పార్టీ మనసులో ఏముంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

అభివృద్దిపై జగన్‌కు దిమ్మతిరిగేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్

Advertisement

జగన్ తీసుకొచ్చిన ‘మావిగన్’ అభివృద్ధికి ధీటుగా కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. రాజధాని అమరావతిని కాసేపు పక్కన బెడదాం. ఎందుకంటే సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రణాళికలో అమరావతి కూడా మెగా సిటీ. ఏపీ అంతటినీ మూడు కేంద్రాలుగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో సిటీ చొప్పున మూడు ప్రాంతాలు మూడు మెగా సిటీలను ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. దీని ప్రకారం.. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఒక ప్రాంతం ఉండనుంది. దీనికి కేంద్రంగా విశాఖ ఉండబోతోంది.

మరొకటి అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు మరొక మెగా సిటీ రానుంది. నెల్లూరు ప్లస్ రాయలసీమకు తిరుపతి కేంద్రంగా మరొక మెగా సిటీ రానుంది. ఈ మూడు ప్రాంతాలకు మూడు మెగా సిటీలు రానున్నాయి. ఆ ప్రాంతాల్లో రకరకాల పరిశ్రమలు రానున్నాయి. ఇక రాయలసీమలో గ్రీన్‌ ఎనర్జీ, హార్టికల్చర్, నాలెడ్జ్ హబ్‌లకు చిరునామాగా మారుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రణాళికను సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. గ్రీన్‌ ఎనర్జీ సంస్థలకు ఆ ప్రాంతంలో భూములను కేటాయిస్తున్నారు కూడా.

Advertisement

చంద్రబాబు ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే,  వైసీపీకి కష్టాలు

ఇక హార్టికల్చర్ విషయంలో ఆ ప్రాంతం ఇప్పటికే టాప్‌లో ఉంది. సీమలో ట్రెండ్‌కు తగ్గట్టుగా అక్కడి రకరకాల పంటలు వేస్తున్నారు. ఈ విషయాన్ని గతేడాది బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా వివరించారు. ఈ నగరాలను టూరిజం, ఐటీతోపాటు వివిధ పరిశ్రమలకు మూడు మెగా సిటీలు కేంద్రాలుగా మారనున్నాయి. మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖలు సమన్వయంతో ఆయా నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. దీనికి సంబంధించి తెర వెనుక పనులు జరుగుతున్నాయి. ఆయా కేంద్రంలో 15 పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి క్లస్టర్ల వారీగా పారిశ్రామికాభివృద్ధి జరగనుంది.

ఇక జగన్ ‘మావిగన్’ విషయానికి వద్దాం. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు జిల్లాలను పారిశ్రామిక జోన్‌గా ఏర్పాటు చేయాలనే ఆలోచన బయట పెట్టారు.మా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిని ఏ మాత్రం జగన్‌కు అందుకే ఈ ప్రాంతాల మధ్య రాజధాని ఉండాలని చెప్పారని అధికార పార్టీ నేతలు మీడియా ముందు చెప్పారు. ఈ లెక్కన జగన్ ఒక్క ప్రాంతానికి పరిమితం కాగా, కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఏపీ వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే కూటమి మెగా సిటీల ముందు మావిగన్ దిగదుడుపేనని అంటున్నారు పాలకపక్షం నేతలు. గతంలో మూడు రాజధానులు అని చెప్పి కనీసం అక్కడ ఎలాంటి పని వైసీపీ చేయలేదని అంటున్నారు. ఈ లెక్కన అభివృద్ధి విషయంలో జగన్ తేలిపోవడం ఖాయమని అంటున్నారు.

ALSO READ: అమరావతి ఆకాంక్ష నెరవేరిన వేళ.. కనకదుర్గమ్మ చెంతకు రాజధాని మహిళల పాదయాత్ర!

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×