Illu Illalu Pillalu Today Episode October 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు కోపంగా ఉంటాడు. శ్రీవల్లి వాళ్లని ఇరికిందామనుకుంటే నాకు కొంపకి నిప్పు అంటుకునింది ఏంటి అని బాధపడుతూ.. భయపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నర్మద విషయంలో పుల్ల పెట్టాలి అని శ్రీవల్లి ధైర్యం చేసుకొని రామరాజు దగ్గరికి వస్తుంది. అక్కడికి సాగర్ రావడం చూసి సాగర్ వచ్చాడు కదా ఇక కచ్చితంగా ఈ గొడవ పెద్దదవుతుంది అని అనుకుంటుంది. అయితే సాగర్ నాన్న అని పిలుస్తాడు కానీ రామరాజు పలక పోవడంతో వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీవల్లి సాగర్ నీకు కావాలని పిలిచి మామయ్య గారిని మీ మామయ్య అవమానించాడు అంటూ అంటుంది.. మొత్తానికి శ్రీవల్లి పుల్ల పెట్టి నిప్పంటి చేస్తుంది. శ్రీవల్లి ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది కానీ విశ్వం ప్లాన్ మాత్రం సక్సెస్ అవుతుంది. అమూల్య మనసులో ఎలాగైనా సరే ప్రేమను సంపాదించాలని విశ్వం చేసిన ప్లాను కాస్త వర్క్ అయ్యేలా కనిపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు తన కొడుకుల గురించి బాధపడుతూ ఉంటాడు.. నేను పెళ్లికి ముందు ఒక అనాధని.. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది బుజ్జమ్మ. ఒకప్పుడు నన్ను ఏరా రామరాజు అని ప్రేమగా పిలిచే వాళ్ళు కూడా లేరు. పెళ్లి తర్వాత నువ్వు అందర్నీ దూరం చేసుకుని నా ఇంటికి వచ్చాక నేను నీ ప్రేమని ఎంతగా పొందానో అది నీకు కూడా తెలుసు. నిన్ను ఎప్పటికీ సంతోషంగా చూసుకోవాలని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. అలా మనకు ఇంత మంది పిల్లలు కలిగిన తర్వాత నా కుటుంబము అన్నది నాకు వచ్చింది మళ్ళీ నా కుటుంబాన్ని నేను దూరం చేసుకోలేను అని బాధపడుతూ ఉంటాడు..
నా కొడుకులను నేను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను.. అలాంటిది ఇప్పుడు ఇల్లరికం పంపించాలని ఆయన అడగ్గానే నా మనసు జివ్వుమంది.. నా పిల్లల్ని ఎప్పటికీ దూరం చేసుకోలేను.. నేను ఉన్నంతకాలం నా కుటుంబం ఇలాగే కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ నేను చనిపోయిన సరే నా కుటుంబం కలిసే ఉండాలని నేను అనుకుంటున్నాను అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఇక నర్మదా దగ్గరకొచ్చిన సాగర్ నేను మీ ఇంటికి వెళ్లడం నువ్వు తప్పుగా భావిస్తున్నావ్ ఏంటి.. నేను ఏదో తప్పు చేసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు.
మీ నాన్న అనడం వేరే ఉద్దేశం కావచ్చు. కానీ మా నాన్న దాన్ని వేరేలా అర్థం చేసుకొని అంటుంటే, నువ్వు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నావు అని సాగర్ అడుగుతాడు.. మా నాన్న వేరేలా అనొచ్చు కానీ మీ నాన్నగారు ఎంత బాధ పడుతున్నారో నువ్వు ఆలోచించు సాగర్ అని నన్మధ అంటుంది. అందుకే నీ తరఫున కూడా నేను క్షమాపణలు చెప్పాను అని నర్మదా అనగానే సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి పడుకుంటాడు. సాగర్ కోపంగా ఉన్నాడని నర్మదా కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది.
ధీరజ్ ఆకలితో పడుకున్నాడని ప్రేమ బాధపడుతూ ఉంటుంది.. ధీరజ్ కి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని అంటాడు. నేను డెలివరీ జాబ్ మానేశాను అనగానే ప్రేమ కాస్త షాక్ అవుతుంది. క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాను దీనికన్నా ఇంకా 6000 ఎక్కువ వస్తాయి కష్టపడకుండా జాబ్ చేసుకోవచ్చు అని అంటాడు.. దాంతో ప్రేమ సంతోష్ పడుతుంది. ఇక తర్వాత రోజు శ్రీవల్లి ముగ్గు వేస్తుంటే విశ్వం మాట్లాడతాడు. అమూల్యకు నా మీద ఎలాంటి రెస్పాన్స్ రాలేదా అని అడుగుతాడు నా మీద ఎలాంటి రెస్పాన్స్ రాలేదా అని అడుగుతాడు.
అయితే శ్రీవల్లి ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ కంగారుపడుతూ మాట్లాడుతుంది. నీ మీద ఎటువంటి రెస్పాన్స్ రాలేదు నువ్వు ఏమి ఇది కావొద్దు అని అంటుంది. అయితే నువ్వు వెళ్లి అమూల్యని బయటికి తీసుకురా అని శ్రీవల్లితో అంటాడు. నేను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పు అని అంటే ఇంకేమీ లేదు మా ఇంట్లో నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు అని శ్రీవల్లి అంటుంది. అది విన్న భద్ర వీలమ్మకు ఫోన్ చేయరా ఆ పది లక్షలు మనకి కావాలని అడుగుదాం అని అంటుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా తీసుకొస్తాను తీసుకురాక చస్తానా అని అంటుంది.
Also Read : పల్లవిపై కమల్ సీరియస్.. అవని మాటతో కూల్.. పల్లవి షాకింగ్ నిర్ణయం..?
భద్ర విశ్వం శ్రీవల్లితో మాట్లాడటం నర్మదా చూస్తుంది. వేసిన శ్రీవల్లి లోపలికి రాగానే ఏంటి వాళ్లతో మాట్లాడుతున్నావు? ఎదురింటి వాళ్ళతో నీకేం పని? మావయ్య గారి గురించి వాళ్ళు చండాలంగా మాట్లాడుతున్నారు అందుకే వార్నింగ్ ఇస్తున్నాను అని శ్రీవల్లి అంటుంది. నర్మదకు మాత్రం ఎక్కడో డౌట్ కొడుతుంది. నీ ముందరే వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను కదా మరి నువ్వు నమ్మవేంటి నమ్మాలి బాబా అని శ్రీవల్లి అంటుంది. ఏదో జరుగుతుంది అది గనక తెలిస్తే నీ ఆట కట్టిస్తాను అని శ్రీవల్లికి నర్మదా వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..