పండుగ సీజన్ నేపథ్యంలో రైల్వే టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో తరచుగా IRCTC వెబ్ సైట్ పనిచేయడం లేదు. ఫలితంగా ప్రజలు దీపావళి రైలు టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారిక సైట్ టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటున్నందున, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. IRCTCకి ప్రత్యామ్నాయ యాప్స్ అయిన Paytm, ConfirmTkt, RailYatriలోనూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో, హ్యాపీగా ఇకపై ప్రత్యామ్నాయ ప్లాట్ ఫారమ్ లలో బుక్ చేసుకోండి.
రైల్ యాత్రి అనే యాప్ రైలు టికెట్ల బుకింగ్ తో పాటు రైలు ట్రాకింగ్, సీట్ మ్యాప్ విజువలైజేషన్, క్రౌడ్ విశ్లేషణతో సహా పలు రైలు సంబంధిత సేవలను అందిస్తుంది. IRCTCలో ఎవైనా సమస్యలు ఏర్పడితే ఆఫ్ లైన్ లో బుకింగ్ లను ప్రాసెస్ చేస్తుంది.
ఒకవేళ ప్రయాణీకులు కోరుకున్న రైల్లో టికెట్లు వెయిట్‌లిస్ట్ చూపిస్తే, ConfirmTkt ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో సాయపడుతుంది. టికెట్ నిర్ధారణ అవకాశాలను అంచనా వేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రయాణీకులకు రద్దీ బుకింగ్ సమయాల్లో సాయం చేస్తుంది. మీ గమ్యస్థానాన్ని సమయానికి చేరుకోవడానికి అవసరమైన సలహాలు ఇస్తుంది. IRCTC బుకింగ్ ఆప్షన్ అందుబాటులో లేని సమయంలో యాప్ స్మార్ట్ వెయిట్ లిస్ట్ ప్రిడిక్షన్ ఇంజిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
IRCTC పనిచేయనప్పుడు రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి Paytm విశ్వసనీయ ప్లాట్ ఫామ్ లలో ఒకటిగా కొనసాగుతుంది. కరెంట్ రైలు స్టేటస్, సీట్ల లభ్యత, PNR నిర్ధారణను తనిఖీ చేయడానికి Paytm యాప్, వెబ్ సైట్ ను ఉపయోగించవచ్చు. ఇది IRCTC బ్యాకెండ్ తో నేరుగా అనుసంధానించబడుతుంది. అన్ని కన్ఫార్మ్ టికెట్లు చెల్లుబాటు అవుతాయి. సర్వర్లు పునరుద్ధరించబడిన తర్వాత ఆటోమేటిక్ గా అప్ డేట్ అవుతాయి. ఒకవేళ లావాదేవీలు సక్సెస్ కాకపోతే, Paytm ఇన్ స్టంట్ వాపసులతో UPI, కార్డ్, వాలెట్ చెల్లింపులను కూడా అనుమతిస్తుంది.
Read Also: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!
దీపావళి రద్దీ నేపథ్యంలో IRCTC వెబ్ సైట్, యాప్ డౌన్ టైమ్ ను ఎదుర్కొంటున్నందున, ప్రయాణికులు తమ ప్లాన్ లను క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Paytm, ConfirmTkt, RailYatri లాంటి విశ్వసనీయ థర్డ్ పార్టీ ప్లాట్ ఫామ్ లు ఆన్ లైన్ లో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. IRCTC సేవలు పూర్తిగా పునరుద్ధరించబడే వరకు, ఈ ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చు. అనుకున్నట్లుగానే దీపావళి ప్రయాణాలు చేసుకోవచ్చు.
Read Also: తత్కాల్ సర్వీస్ లేకున్నా.. అదే రోజు కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగంటే!