Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనం, వసతి జనవరి కోటా తేదీలను విడుదల చేసింది. 2026 జనవరి నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్, టీటీడీ దేవస్థానముల యాప్ లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరు చేస్తారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Also Read: Tirumala News: తప్పుడు వార్తలపై టీటీడీ సీరియస్.. ధర పెంచే ఆలోచన లేదు-ఛైర్మన్
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం అధికారులు భక్తులకు సూచించారు.