Pawan Kalyan:ప్రస్తుత కాలంలో భాషతో సంబంధం లేకుండా హీరోలు తమకు నచ్చిన భాషలో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు, ఇతర భాష డైరెక్టర్ లతో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి అని.. ఒకవేళ ఆ చర్చలు సఫలం అయితే త్వరలోనే కోలీవుడ్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ మూవీ ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ చేయబోయే ఆ కోలీవుడ్ డైరెక్టర్ ఎవరు? కథ ఏంటి? నిర్మాతలు ఎవరు? ఏ జానర్లో సినిమా చేయబోతున్నారు? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
విషయంలోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుకి తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లేదా దర్శకుడు హెచ్. వినోద్ (H.Vinodh) లలో ఎవరో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరిలో ఒకరితో పవన్ త్వరలోనే సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఇప్పటికే మాస్ డైరెక్టర్లుగా పేరు సొంతం చేసుకున్న వీరి విజన్ కి పవన్ కళ్యాణ్ మాస్ పెర్ఫార్మెన్స్ తోడైతే ఇక విధ్వంసం గ్యారంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
also read:Rekha Boj: మొన్న గాజులు.. నేడు కిడ్నీలు.. పాపం పట్టించుకోండయ్యా!
గత పది సంవత్సరాలుగా రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ.. తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎట్టకేలకు 2024లో ఆంధ్రప్రదేశ్లో టిడిపి, బిజెపి లతో కలిసి కూటమిగా ఏర్పడి పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీని దక్కించుకోవడమే కాకుండా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినందుకుగాను ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తనను నమ్ముకున్న అభిమానులను నిరాశపరచకూడదని తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే చేసిన హరిహర వీరమల్లు సినిమా పరవాలేదు అనిపించుకుంది. దీనికి తోడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాతో కూడా మోస్తారుగా మెప్పించారు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే గబ్బర్ సింగ్ సినిమా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో రిపీట్ కాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.