కొంకణ్ రైల్వే పరిధిలో నడుస్తున్న 38 రైళ్లకు సంబంధించిన షెడ్యూల్స్ ను మార్చుతున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. సాధారణం కంటే 10 రోజుల ముందు నుంచే సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు కొంకణ్ రైల్వే ప్రకటించింది. వాస్తవానికి ప్రతి ఏటా జూన్ 10 నుంచి అక్టోబర్ 31 వరకు కొంకణ్ పరిధిలో నడుస్తున్న రైళ్ల షెడ్యూల్ ను మార్చుతారు. అక్టోబర్ 31 నుంచి మళ్లీ యథావిధిగా రైళ్లు నడుస్తాయి. అయితే, ఈ ఏడాది 10 రోజులు ముందుగా రైళ్ల సమయాలు సవరిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 20 నుంచి షెడ్యూల్ మారనున్నట్లు తెలిపారు.
కొత్త టైమ్ టేబుల్ కారణంగా మంగళ, నేత్రావతి, మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ లాంటి ప్రధాన రైళ్ల షెడ్యూల్ లలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పుల కారణంగా ప్రస్తుత సమయాలతో పోల్చితే చాలా గంటల తేడాలు వచ్చే అవకాశం ఉంది. కొంకణ్ మార్గంలో రైళ్ల వేగం కూడా పెరగనుంది. అక్టోబర్ 21- జూన్ 15 మధ్య రైళ్లు 110–120 కి.మీ. వేగంతో నడుస్తాయి. వర్షాకాలం పరిమితి 40–75 కి.మీకి తగ్గిస్తారు. సవాళ్లలో కూడిన వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి సమయానుగుణంగా వేగంలో హెచ్చుతగ్గులను నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రతి ఏటా ఈ స్పీడ్ లో మార్పులు చేర్పులు చేస్తుంటారు.
⦿ ఎర్నాకులం-నిజాముద్దీన్ మంగళ లక్షద్వీప్ SF ఎక్స్ ప్రెస్ (12617) గతంలో కంటే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ప్రస్తుతం ఈ రైలు ఎర్నాకులం నుంచి ఉదయం 10.30 గంటలకు బయల్దేరగా, ఇకపై మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరుతుంది. నిజాముద్దీన్-ఎర్నాకులం మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ (12618) మంగళూరు నుంచి గంట ముందుగా అంటే రాత్రి 10.35 గంటలకు బయలుదేరుతుంది.
⦿ తిరువనంతపురం-లోక్ మాన్య తిలక్ నేత్రావతి ఎక్స్ ప్రెస్ (16346) ఇప్పుడు ఉదయం 9.15 గంటలకు బయలుదేరుతుంది. ఈ మార్పు నెక్ట్స్ స్టేషన్లలో కాస్త ఆలస్యానికి కారణమవుతుంది. ఇది మధ్యాహ్నం 1.45 గంటలకు ఎర్నాకుళం జంక్షన్, సాయంత్రం 4.20 గంటలకు షోరనూర్, సాయంత్రం 6 గంటలకు కోజికోడ్, సాయంత్రం 7.32 గంటలకు కన్నూర్ చేరుకుంటుంది. ప్రస్తుతం, రైలు మధ్యాహ్నం 1.10 గంటలకు ఎర్నాకుళం జంక్షన్, మధ్యాహ్నం 3.40 గంటలకు షోరనూర్, సాయంత్రం 5.07 గంటలకు కోజికోడ్, సాయంత్రం 6.37 గంటలకు కన్నూర్ చేరుకుంటుంది.
⦿ లోకమాన్య తిలక్-తిరువనంతపురం నేత్రావతి ఎక్స్ ప్రెస్ (16345) ప్రస్తుత షెడ్యూల్ కంటే 1 గంట 30 నిమిషాలు ముందుగా చేరుకుంటుంది. ఇది ఉదయం 4.20 గంటలకు మంగళూరు, ఉదయం 6.32 గంటలకు కన్నూర్, ఉదయం 8.07 గంటలకు కోజికోడ్, ఉదయం 10.15 గంటలకు షోరనూర్, మధ్యాహ్నం 12.25 గంటలకు ఎర్నాకుళం, సాయంత్రం 6.05 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.
⦿ మంగళూరు నుండి ముంబై వెళ్లే మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్ (12620) మధ్యాహ్నం 12.45 గంటలకు బదులుగా 2.20 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో (12619) మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి ఉదయం 10.20 గంటలకు బదులుగా ఉదయం 7.40 గంటలకు మంగళూరు చేరుకుంటుంది.
⦿ ఎర్నాకులం–అజ్మీర్ మారుసాగర్ ఎక్స్ ప్రెస్ (12977): రాత్రి 10.45 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.12లకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
⦿ తిరువనంతపురం నార్త్ (కొచువేలి) – భావ్ నగర్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ (19259): మంగళవారం నుంచి రాత్రి 10.35 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.07కు చేరుకుంటుంది.
⦿ ఎర్నాకులం – ఓఖా ఎక్స్ ప్రెస్ (16338): ఇకపై రాత్రి 10.35 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.07 గంటలకు చేరుతుంది.
⦿ తిరువనంతపురం సెంట్రల్ – వెరావల్ ఎక్స్ ప్రెస్ (16334): రాత్రి 10.35 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.07 గంటలకు చేరకుంటుంది.
⦿ తిరువనంతపురం–చండీగఢ్ (కేరళ సంపర్క్ క్రాంతి – 12217): ఈ రైలు మధ్యాహ్నం 3.05 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4.27 గంటలకు చేరుకుంటుంది.
Read Also: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!