Rekha Boj: సాధారణంగా చాలామంది ఇండస్ట్రీలోకి రావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే సోషల్ మీడియాను ఫ్లాట్ ఫామ్ గా చేసుకొని.. తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక అమ్మాయి పిచ్చి పరాకాష్టకు చేరిపోయింది. నా జీవితం సినిమాకే అంకితం అంటూ ఏకంగా మొన్న గాజులమ్మి వీడియో చేసిన ఈమె.. నేడు కిడ్నీలు అమ్మడానికి కూడా సిద్ధమంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ కి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్న గాజులమ్మేసింది.. నేడు కిడ్నీలు అమ్ముతానంటోంది. రేపు ఇంకేం చేస్తుందో.. కాస్త పట్టించుకోండి అయ్యా అంటూ దర్శక నిర్మాతలకు ట్యాగ్ చేస్తున్నారు. మరి ఆమె ఎవరు ? సినిమాలంటే ఎందుకు అంత పిచ్చి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి రేఖా భోజ్(Rekha boj). ఒకప్పుడు అలాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమెకు అవకాశాలు కరువైపోయాయి. దీంతో కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్లో కెరియర్ ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే మొన్నామధ్య ‘పుష్ప’ సినిమాలోని సామీ సామీ పాట కవర్ సాంగ్ చేసేందుకు ఏకంగా తన రెండు బంగారు గాజులను అమ్మేసింది. ఇప్పుడు అంతటితో ఆగకుండా కుదిరితే కిడ్నీలైనా అమ్ముకుంటాను. కానీ నటనను మాత్రం వదిలేసి వెళ్ళను అని చెప్పేస్తోంది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం ‘లవ్ ఇన్ వైజాగ్’.. షణ్ముఖ్ తో కలిసి నటించాను. ఆ తర్వాత ‘డర్టీ పిక్చర్’ అనే మరో షార్ట్ ఫిలిం చేశాను.
ఆ తర్వాత ‘ కాలాయ తస్మై నమః’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాను. పుష్ప నా జీవితంలో ఫస్ట్ కవర్ సాంగ్. దీనికోసం గాజులు అమ్మేశాను. ఈ సాంగ్ వల్లే ‘మాంగళ్యం’ సినిమాలో అవకాశం వచ్చి మంచి పేరు లభించింది. గత ఐదారు సంవత్సరాలుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ కమిట్మెంట్లు అడుగుతున్నారు. బంగ్లాలు రాసిస్తాం.. కార్లు ఇస్తాం.. అంటూ మభ్యపెడుతున్నారు. ఒకవేళ ఆరోజే నేను వాళ్ళు అడిగిన కమిట్మెంట్ కి ఓకే చెప్పి ఉండుంటే.. ఈరోజు చేతినిండా అవకాశాలు, బోలెడంత డబ్బు ఉండేది. కానీ నాకు అవసరం లేదు. అందుకే నా దగ్గర ఉన్న వస్తువులను అమ్ముకొని మరీ నేను నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పని చేయడానికి నిర్మాతలు ముందుకు రాకపోతే.. మొత్తం ఆస్తిని అమ్మేసి ఒక సినిమా చేస్తాను. గాజులమ్మగా వచ్చిన నాలుగు లక్షలతో సామీ సామీ పాట చేశాను కదా.. అలాగే కిడ్నీలు కూడా అమ్మి.. ఆ డబ్బులతో సినిమా చేద్దామనుకుంటున్నాను అంటూ తెలిపింది రేఖా భోజ్.
also read:Actress Death: ప్రముఖ నటి సమంత కన్నుమూత.. ప్రశాంతంగా నింగిలోకి ఎగసింది అంటూ!
ఇకపోతే బిగ్ బాస్ లో అవకాశం కోసం గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను అంటూ కూడా తెలిపింది. గత ఏడాది ఇంటర్వ్యూ అయింది. అంతా ఓకే అన్నారు. ఇక వారంలో షో మొదలవుతుంది అనే సమయంలో నన్ను రిజెక్ట్ చేశారు. ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా షోకి వస్తున్నారు. నన్ను మాత్రం తీసుకోవడం లేదు. ఇటు సీజన్ 9కి కూడా వీడియో పంపించాను. అదృష్టం కలిసి రాలేదు అంటూ తెలిపింది రేఖా భోజ్.