Minister Post MLA Balakrishna: ఇన్నాళ్లకు సడన్‌గా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులకు ఎందుకు మంత్రి పదవిపై ఎందుకు మోజు పెరిగింది? గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేనిది ప్రస్తుతం ఎందుకు అమాత్య పదవి పై డిమాండ్లు మొదలుపెట్టారు? బాలయ్య ఎప్పుడూ ఏ పదవి ఆశించరన్న పేరుంది. అలాంటిది ఆయన అనుచరులు ఎందుకు హడావుడి చేస్తున్నారు?
రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న నందమూరి బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, లోకేష్ తర్వాత ఎవరూ అంటే.. తప్పకుండా బాలకృష్ణ అని సమాధానం వస్తుంది. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నది ఆయనే. ఒక విధంగా చెప్పాలంటే పదవులు ఆశించకుండా పార్టీలో ఉంటూ వస్తున్నారు బాలయ్య. నందమూరి కుటుంబాన్ని జనాలు గుర్తించుకునే విధంగా ఉండడం కోసమే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా హిందూపురం నుంచి మూడుసార్లు గెలిచారు. 2019 జగన్ ప్రభంజనంలో సైతం గట్టిగానే నిలబడ్డారు .
ఏనాడూ మంత్రి పదవి ఆశించని బాలకృష్ణ
అందుకే 2024 ఎన్నికల్లో గెలిచేసరికి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ ఒకవైపు సీఎం గా చంద్రబాబు ఉండగా.. లోకేష్ మంత్రిగా ఉన్నారు. కుల సమీకరణలు, ఫ్యామిలీ అనుబంధాల దృష్ట్యా బాలకృష్ణకు చాన్స్ రాలేదు. అలాగని తనకు మంత్రి పదవి కావాలని బాలకృష్ణ ఎన్నడూ కోరలేదు. కనీసం ఒక్క పని కోసం గురించి కానీ.. పదవి కోసం కానీ పట్టుబట్టే గుణం కాదు నందమూరి బాలకృష్ణ ది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో నందమూరి బాలకృష్ణ మంత్రిగా చూడాలనుకుంటున్నారు అభిమానులు. అందుకే తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. తాజాగా హిందూపురంలో సైతం అభిమానులు ఇదే డిమాండ్ చేస్తున్నారురు. కానీ బాలకృష్ణ మాత్రం సున్నితంగా దాన్ని తోసి పుచ్చుతున్నారు.
నందమూరి ఫ్యామిలీకి, టీడీపీకి సెంటిమెంట్‌గా మారిన హిందూపురం
2014లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచే దివంగత నందమూరి తారక రామారావు, ఆ తర్వాత నందమూరి హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు. అక్కడ నందమూరి కుటుంబానికి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అందుకే బాలకృష్ణ సెంటిమెంట్‌గా ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2014లో నందమూరి బాలకృష్ణ గెలవడం.. టిడిపి అధికారంలోకి రావడంతో తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని అంచనా వేశారు. కానీ తనకు రాజకీయాల కంటే సినిమాలే మొదటి ప్రయారిటీ అన్నట్టు బాలకృష్ణ వ్యవహరించారు. పైగా నారా లోకేష్ అప్పుడే మంత్రి అయ్యారు. ఒకే కుటుంబంలో మూడు పదవులు సరికాదని భావించి బాలకృష్ణ కూడా మంత్రి పదవి కోసం డిమాండ్ చేయలేదు.. అదికాక బాలయ్య కు నటన అంటే ఇష్టం కాబట్టి అమాత్య పదవికి దూరంగా ఉంటూ వస్తున్నారు.
బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ప్ల కార్డులు
తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు నందమూరి బాలకృష్ణ. సోమవారం ఉదయం బాలయ్య స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులను కలిసేందుకు బాలయ్య కారులో వెళ్తుండగా కొంతమంది అభిమానులు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారు. బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏది మాట్లాడకుండా నవ్వుతూ సముదాయించే ప్రయత్నం చేయబోయారు. దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చజెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Also Read: జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరుపై ఉత్కంఠ..! గెలిచేదెవరు..?
అయితే బాలకృష్ణ కు అమాత్య పదవులపై అంతా ఆసక్తి లేదట… అయితే హిందూపూర్ టీడీపీ నేతలకు, అక్కడి కార్యకర్తలకు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు….ప్రస్తుతం బాలయ్యకు మంత్రి పదవి డిమాండ్ చేస్తూ ప్రదర్శించిన ప్లకార్డులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Story By Apparao, Bigtv