Brahmamudi serial today Episode: స్టేషన్‌లో ఉన్న వెంకీ దగ్గరకు లక్ష్మీ, చలపతి వెళ్లి ఏడుస్తుంటారు. అప్పుడే రాజు, ఇందు వెళ్తారు. ఎం జరిగిందిరా అంటూ రాజు అడిగితే ఏమో అన్నయ్య తెలియదు. మేనేజర్ నా మీద కేసు పెట్టాడు అని చెప్తాడు. రాజు కోపంగా నందును తిడుతూ వీడు ఎలాంటి వాడో నీకు తెలియదా..? ఎవరో కేసు పెడితే అరెస్ట్ చేస్తావా..? అంటూ తిడుతుంటే.. ఇందు కల్పించుకుని నువ్వుండు రాజు నందు తన డ్యూటీ తాను చేసింది ఇంతకీ ఏం జరిగింది వెంకీ చెప్పు అంటూ ఇందు అడుగుతుంది. చెప్పరా అసలేం జరిగింది. నువ్వేమైనా చేశావా..? అంటూ రాజు అడిగితే.. అవును అన్నయ్య చేశాను నీకు చెప్పాను కదా మా ఆఫీసులో గోల్డ్ విషయంలో ఏదో తప్పు జరుగుతుందని అది ఎత్తి చూపాను అందుకే నా మీద తప్పుడు కేసు పెట్టి ఉంటారు అని వెంకీ చెప్పగానే..
విన్నావా..? ఇందు నా తమ్ముడు తప్పు చేయలేదు.. ఇదంతా ఆ ఐశ్వర్య చేసి ఉంటుంది. నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడే తనను గమనించాను అదోలా చూసింది. ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఇది కచ్చితంగా ఐశ్వర్య పనే అంటాడు. దీంతో ఇందు ఆవేశ పడకు రాజు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అంటూ చెప్తుంటే.. రాజు కోపంగా ఐషుకు ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడినే అరెస్ట్ చేయిస్తుంది అంటాడు. నందు కోపంగా వెంకీ నువ్వు చెప్పింది నిజమే అయితే నేను చూస్తూ ఊరుకోను తప్పు చేసిన వాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటాను అంటూ చెప్తుంటే.. అప్పటి దాకా నేను ఊరికే ఉంటాను అనుకున్నావా..? ఏ తప్పు చేయని నా తమ్ముడిని స్టేషన్‌లో నిలబెట్టారు అందుకు కారణమైన వాళ్ల తాట తీస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే లాయరు వచ్చి బెయిల్ పేపర్స్ ఇస్తాడు. నందు, వెంకీని విడిచిపెడుతుంది. రాజు కోపంగా మీరు ఇంటికి వెళ్లండి నేను వెళ్లి ఐషు సంగతి చూస్తాను అంటూ వెళ్లిపోతాడు.
ఇంట్లో ఉన్న రేఖ, భ్రమరాంబ సంతోషంగా ఐశ్వర్యతో మాట్లాడుతుంటారు. నువ్వు సూపర్ ఐషు అసలు ఇలా ఎలా సాధించావు.. ఎంత పకడ్బందీ ప్లాన్ లేకపోతే ఇంతలా చేస్తావు.. ఇలాంటి పనులు చేయాలంటే టైమింగ్ మెయింటేన్ చేయగలగాలి అంటూ కొనియాడుతుంది రేఖ. ఇంత చిన్న వయసులోనే ఇంతలా చేస్తుంది అంటే.. ఇక నిన్ను మించిపోతుంది రేఖ అంటూ భ్రమరాంబ అంటుంది. పాపం తమ్ముడు అరెస్ట్ అయ్యాడు అనగానే.. ఇక్కడ అన్న ముఖంలో నెత్తుటి చుక్క లేదు అనుకుంటూ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే శేషు.. మీరు తెలివిగా ఆ వెంకీని ఇరికించామని అనుకుంటున్నారు కానీ నాకు మీ ఫ్యూచర్ కనిపిస్తుంది అంటే ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని రేఖ అడిగితే.. అవునమ్మా మీరు ఆ ఇందు, రాజులను తక్కువ అంచనా వేస్తున్నారు. ఎరక్కపోయి ఇరుక్కుపోతారేమోనని నా ఎడమ కన్ను హెచ్చరిస్తుంది అంటాడు. భ్రమరం కోపంగా శేషును తిడుతుంది.
ఇంటికి వెళ్లిన వెంకీ రూంలో కూర్చుని బాధపడుతుంటే.. బయట చలపతి లక్ష్మీతో బాధపడుతుంటాడు. వీధిలో ఎవరెవరో ఏవేవో మాటలు అంటున్నారని ఎమోషనల్ అవుతుంటాడు మన ఇంటికి పోలీసులు వచ్చారంటే అది నేను తట్టుకోలేకపోతున్నానే.. మన ఇంట్లో ఎప్పుడు సమస్యలు వస్తాయోనని భయం వేస్తుంది అంటూ ఏడుస్తుంటే.. అప్పుడే నందు వస్తుంది. ఏంటమ్మా నందు మళ్లీ ఎందుకు వచ్చావు అరెస్ట్ చేస్తావా..? కేసు పని మీదే వచ్చావా..? అంటూ చలపతి నిలదీయగానే.. లక్ష్మీ తిడుతుంది. నందు అలాంటిది కాదు.. వాడిని తీసుకెళ్లిన రెండు నిమిషాల్లోనే బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది అంటుంది. లక్ష్మీ నందును ఇంట్లోకి రమ్మని పిలిస్తే.. ఒక్కసారి పోలీసొళ్లు ఇంటికి వస్తేనే చుట్టు పక్కల తల ఎత్తుకోకుండా అయింది. మళ్లీ నువ్వు ఇంట్లోకి పిలుస్తున్నావా..? అంటూ నందును ఇంకెప్పుడు మా ఇంటి గుమ్మం తొక్కొద్దు అంటాడు. నందు బాధగా వెళ్లిపోతుంది.
ఇంటికి వెళ్లిన రాజు కోపంగా ఐశ్వర్యను నిలదీస్తాడు. వెంకీని ఎందుకు అరెస్ట్ చేయించావు అని అడుగుతాడు. దీంతో ఐషు కోపంగా దొంగతనం చేయడం మీ వంతు అరెస్ట్ గురించి నన్ను అడగటం ఏంటి..? అంటూ నిలదీస్తుంది. దొంగతనాలు చేయడం మీ వంతు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో రాజు కోపంగా నువ్వు చేసిన ఈ తప్పుకు నిన్ను ఎలా శిక్షించాలో నాకు తెలుసు అంటూ రాజు తిడుతుంటే.. లక్కీ అడ్డుపడి ఐశ్వర్యను అలా అనొద్దని అంటాడు. అందుకు రాజు కోపంగా లక్కీని తిడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఐశ్వర్యను తాను వదిలిపెట్టనని అన్ని సాక్ష్యాలతో నిరూపించి తనను జైళ్లో కూర్చోబెడతానని అంటాడు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి అప్పుడు మాట్లాడు అంటే ఆధారాలు ఉంటే ఇక మాటల్లేవు అంటూ వెళ్లిపోతాడు రాజు.
ఇందు, నందు, రాజు కలిసి ఎలాగైనా వెంకీ తప్పు చేయలేదని.. ఐశ్వర్య తప్పు చేసిందని నిరూపించడానికి ఒక కొత్త ప్లా్‌న్ చేస్తారు. ముగ్గురు కలిసి మేనేజర్‌ను ట్రాప్ చేయాలని డిసైడ్ అవుతారు. అందుకోసం ఇందు ఆ మేనేజర్‌కు ఫోన్ చేసి తాను స్వరాజ్ కంపెనీ చైర్మన్ ను అంటూ పరిచయం చేసుకుంటుంది. ఆ మేనేజర్ చాలా ఎగ్జైట్ అవుతాడు. మీలాంటి వాళ్లు నాలాంటి వాడికి ఫోన్ చేయడం ఏంటి..? అని అడుగుతాడు. అందుకు ఇందు ఎందుకు ఫోన్ చేయకూడదా అంటూ లాభాలు ఒక్క ఐశ్వర్య కంపెనీకేనా మాకు వద్దా అంటూ మెల్లగా మాటలతో ట్రాప్ చేస్తుంది. తర్వాత రోజు ఆ మేనేజర్‌ను కలవడానికి వెళ్తారు రాజు, ఇందు. అప్పుడే ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.