BigTV English

Chandrababu Naidu News : మద్యం కేసు.. చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీ క్లారిటీ..

Chandrababu Naidu News : మద్యం కేసు.. చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీ క్లారిటీ..

Chandra babu in AP liquor case(Andhra pradesh today news):

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినా.. ఇంకా అనేక ఈ కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా సోమవారం చంద్రబాబుపై మరో కూడా సీఐడీ నమోదు చేసింది. అయితే ఈ కేసులోనూ ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానంలో వాదనల సమయంలో చంద్రబాబు అరెస్టుపై సీఐడీ క్లారిటీ ఇచ్చింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్‌ వచ్చినందుకు మద్యం కేసులో అరెస్టు చేయబోమని స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్‌ గడువు ముగిసేవరకు అరెస్టు చేయబోమని హైకోర్టుకు లిఖితపూర్వకంగా అడ్వకేట్‌ జనరల్‌ హామీ ఇచ్చారు.

మరోవైపు చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో మరో 5 అదనపు నిబంధనలు చేర్చాలని హైకోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.


1.రాజకీయ యాత్రలు, సభల్లో పాల్గొనకూడదు. ప్రశంగించకూడదు.

2.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదు.

3.కేవలం వైద్యం కోసమే బెయిల్ ను ఉపయోగించాలి.

4.కేసు వివరాలను ప్రెస్ , పబ్లిక్ ముందు మాట్లాడకూడదు.

5.ఇద్దరు DSP స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలి.

ఈ ఐదు నిబంధనలను బెయిల్ కండిషన్స్ లో చేర్చాలని సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశాలను బెయిల్ కండిషన్స్ లో చేర్చాలని కోరింది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నవంబర్ 10న విచారణ చేపట్టనుంది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×