E-Paper
Advertisement

జగన్ ఆలోచన ప్యాలెస్ కోసం.. సిద్ధాంతం కూడా అదే, ఆ లాజిక్ మరిచి ఎలా మాట్లాడుతున్నారు- సీఎం చంద్రబాబు

జగన్ ఆలోచన ప్యాలెస్ కోసం.. సిద్ధాంతం కూడా అదే, ఆ లాజిక్ మరిచి ఎలా మాట్లాడుతున్నారు- సీఎం చంద్రబాబు
Advertisement

Amaravati: కూటమి నేతల అంతా ప్రజల కోసం చేస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. కానీ ప్రతిపక్ష నేత జగన్ ఆలోచన అంతా ప్యాలెస్ కోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. చెప్పాం.. చేస్తున్నాం.. చేస్తామని అన్నారు. తాను విమర్శలకు దిగడం లేదని, చెప్పకపోతే చారిత్రక తప్పిదం అవుతుందన్నారు. నా రాజకీయ అనుభవంలో హింసకు తావులేదన్నారు. అలాగని హింసకు ప్రతి హింస సమాధానం కాదన్నారు. దేనికైనా సహనం అవసరమన్నారు.

జగన్ పై మరోసారి శివాలెత్తిన సీఎం చంద్రబాబు

లోకల్ బాడీ ఎన్నికల్లో జరుగుతున్న రచ్చ గురించి కీలక ప్రశ్నలు లేవనెత్తారు సీఎం చంద్రబాబు. కుప్పం, పిఠాపురం , పులివెందుల, విశాఖలో నామినేషన్లు పడ్డాయని, ఒక్క కడపలో నామినేషన్ ఎందుకు పడలేదని ప్రశ్నించారు. ఎందుకు వక్రీకరించిన మాట్లాడుతున్నారని సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు 26 వేల నామినేషన్లు వచ్చాయన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు 46 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయన్నారు. జెడ్పీటీసీలకు 4 వేలకు పైగానే వచ్చాయని వివరించారు.

Advertisement

వైసీపీ నామినేషన్లు కూటమి నేతలు వేశారని అంటున్నారని, ఇలాంటివి బీఫారమ్ ఇచ్చినప్పుడు తెలుస్తుందన్నారు. వైసీపీ చేసిన విధ్వంసం రాష్ట్రానికి తీరని ద్రోహమని మరోసారి పునరుద్ఘాటించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు మంచి జరిగితే చూడలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టడం ఆ పార్టీకి ఇష్టంలేదని, ఓడిపోతే కోలుకోవడం కష్టమవుతుందని వారి భయమని తేల్చేశారు. ప్రజలు మాకు ఇచ్చే మిడ్ టర్న్ అప్రైజల్ అని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు అనేది తెలుసుకునే అవకాశం వస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగకూడదని పంతం పట్టారని, వాళ్లే పిటిషన్లు వేస్తారని, హింస కూడా వాళ్లే చేస్తారన్నారు.

మా సిద్ధాంతం ఇదీ.. వైసీపీ సిద్ధాంతం అది-సీఎం

ఎన్నికలు పెట్టిన తర్వాత 62 పిటిషన్లు వేశారని వెల్లడించారు. సర్ వచ్చిన తర్వాత ఎన్నికలు అడ్డుకోవాలని నానా ప్రయత్నాలు చేశారని అన్నారు. బీసీ రిజర్వేషన్లు, డీ లిమిటేషన్ పైనా సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టుకుంటే కేంద్రం నుంచి నిధులు రావన్నారు. నిధులు రాకుంటే అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉందన్నారు. నక్సలైట్లను మెయిన్ స్ట్రీమ్‌కు రావాలని ఆనాడు కోరామన్నారు సీఎం. అదే సమయంలో సీతక్క రాజకీయ ప్రస్థానంపై మాట్లాడారు. జనశక్తి నాయకురాలు మెయిన్ స్ట్రీమ్‌కు వచ్చారని, ఇప్పుడు తెలంగాణలో ఆమె మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.

Advertisement

హింస విడనాడి.. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండాలన్నారు. ఈ విషయంలో కూటమి సిద్ధాంతం ఒక్కటేనని, అభివృద్ధి, సంక్షేమం, మంచి పరిపాలన అని అన్నారు. కానీ వైసీపీ సిద్ధాంతం క్రిమినలైజేషన్, లిటిగేషన్, విధ్వంసమన్నారు. తప్పుడు ప్రచారం అనేది వైసీపీ సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై పోరాటం చేసినప్పుడు ఎదుర్కోకపోతే, భవిష్యత్ కు నాంది పలకదన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధిని చేసినప్పుడు విమర్శలు చేశారని, అడ్డుపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆ విషయంలో తాను ఎక్కడా తగ్గలేదన్నారు. ఆ విధంగా చేశాము కాబట్టే ఇవాళ తెలంగాణ నెంబర్ ఎకానమీ అయ్యిందన్నారు. ఆనాడు చేసిన పనితో కొన్ని అనుభవం వచ్చిందని, విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా వికేంద్రీకరణకు పెద్ద పీఠ వేశామన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నది మా మూడు పార్టీల ఆలోచనగా చెప్పుకొచ్చారు.

ALSO READ:  కూటమిలో సీట్ల సర్దుబాటు సవాలు.. మీడియా ముందుకు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Related News

కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ సవాలు.. రెబల్స్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ హెచ్చరిక

అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పాఠశాలలకు సెలవులు, విద్యుత్ ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అలర్టయిన రైల్వే శాఖ, 53 రైళ్లు రద్దు!

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ.. ఇలా దోపిడీ చేయడం ఏంటి?: అనిల్ కుమార్ యాదవ్

కర్నూలులో హైడ్రామా.. తొడ కొట్టి, మీసం తిప్పి టీడీపీకి హఫీజ్ ఖాన్ సవాల్!

ఇంజనీర్ లలిత కుమారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అందుకే చంపేసాడా..?

Big Stories

Advertisement
×