E-Paper
Advertisement

హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది.. డీలర్‌ షిప్‌లో కనిపించిన కొత్త బైక్!

హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది.. డీలర్‌ షిప్‌లో కనిపించిన కొత్త బైక్!
Advertisement

Hero Karizma XMR 250: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి మరో కొత్త స్పోర్ట్స్ బైక్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. హీరో కరిజ్మా XMR 250 తాజాగా రెడ్ కలర్ లో ఓ డీలర్‌ షిప్‌ లో కనిపించింది. దీంతో ఈ బైక్ విడుదలపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కరిజ్మా XMR 210 కంటే ఎక్కువ సామర్థ్యంతో రూపొందించిన ఈ మోడల్.. కంపెనీ ఫ్లాగ్‌ షిప్ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్‌ సైకిల్‌ గా నిలవనుంది. అయితే, దీని విడుదల తేదీ, ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఆకట్టుకునేలా స్పోర్టీ డిజైన్

హీరో కరిజ్మా XMR 250 డిజైన్ ప్రస్తుత XMR 210ను పోలి ఉంటుంది. ఇందులో ప్రొజెక్టర్ LED హెడ్‌ ల్యాంప్, బూమరాంగ్ ఆకారంలో ఉండే డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ఉన్నాయి. హెడ్‌ ల్యాంప్ కిందకు ఎక్స్ టెండ్ ఫెయిరింగ్, ఇంటిగ్రేటెడ్ వింగ్‌ లెట్స్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ ను ఇస్తాయి. దీనికి పొడవైన విండ్‌ స్క్రీన్, గోల్డ్ ఫినిషింగ్‌తో కూడిన USD ఫ్రంట్ ఫోర్క్, ఆకర్షణీయమైన ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు కూడా ఉన్నాయి. రెడ్ కలర్ ఈ బైక్‌కు మరింత స్పోర్టీ లుక్ అందిస్తోంది. గతంలో ఈ మోడల్ వైట్, బ్లాక్ రంగుల్లోనూ కనిపించింది.

249cc ఇంజిన్.. 30hp పవర్

Advertisement

కరిజ్మా XMR 250లో హీరో ఎక్స్‌ ట్రీమ్ 250Rలో ఉపయోగించిన 249cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 9,250rpm దగ్గర 30hp గరిష్ఠ శక్తిని, 7,500rpm దగ్గర 25.3Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. ఈ ఇంజిన్‌ తో కరిజ్మా XMR 250 మంచి పనితీరును అందించే అవకాశం ఉంది. అయితే, ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను హీరో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ధర ఎంత ఉంటుందంటే?

హీరో కరిజ్మా XMR 250 ధరపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం కరిజ్మా XMR 210 ప్రారంభ ధర రూ. 1.86 లక్షలుగా ఉండగా, ఎక్స్‌ ట్రీమ్ 250R ధర రూ. 1.84 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కరిజ్మా XMR 250 ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఎప్పుడు విడుదలవుతుంది?

Advertisement

డీలర్‌ షిప్‌ లో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బైక్ కనిపించడంతో దీని విడుదల వీలైనంత త్వరగా ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, హీరో మోటోకార్ప్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ బైక్‌కు సుజుకి గిక్సర్ SF 250, KTM RC 200 లాంటి స్పోర్ట్స్ బైక్ ల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ధర, ఫీచర్లు, పనితీరు విషయంలో హీరో ఎలాంటి ప్యాకేజీ అందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. నవంబర్‌ లో రానున్న 4 కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఇవే!

Tags

Related News

గ్లోబల్ ఎంట్రీకి ముందే టీజర్ విడుదల.. హిమాలయన్ 750 ఏముంది గురూ!

లగ్జరీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. డిఫెండర్ ధర ఏకంగా రూ. 34 లక్షలు తగ్గింది!

కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్.. క్విక్‌ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేశాయ్!

జీప్ కంపాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర రూ. 21.99 లక్షలే!

సన్‌రూఫ్ +ADAS.. రూ.10 లక్షలకే హ్యుందాయ్ కొత్త SUV!

రూ.10 లక్షల లోపు కొత్త కార్లు.. త్వరలో రానున్న టాప్ మోడళ్లు ఇవే!

మహీంద్రా థార్ E To హ్యుందాయ్ ఇన్‌స్టర్.. నవంబర్ లో ఎంట్రీ ఇవ్వనున్నక్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Big Stories

Advertisement
×