Amaravati: స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ సవాలుగా మారిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. క్లిష్ల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పడే కోలుకుంటున్నామని అన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని వివరించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు మూడు పార్టీలకు సవాల్‌గా మారింది. దీంతో కూటమి విచ్ఛిన్న అవుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం మీడియా ముందుకు వచ్చారు మూడు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్‌లు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుతోపాటు అభ్యర్థుల ఎంపిక కూడా కీలకంగా మారిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతోచాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టీడీపీకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని, జనసేన బలంగా నిలబడిందన్నారు. బీజేపీకి పటిష్టమైన సంస్థాగత బలం ఉందన్నారు. సీట్ల సర్దుబాటులో సీఎం చంద్రబాబు చాలా సలహాలు ఇచ్చారని వివరించారు. అందరికీ సర్ది చెప్పడంలో సీఎం చంద్రబాబు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు.
రాష్ట్రానికి స్థానిక సంస్థలు చాలా కీలకమైనవని, 2024 ఎన్నికల్లో కూటమి చూపిన ఐక్యత ఈ ఎన్నికల్లోనూ చూపాలన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. గడిచిన పదేళ్లు జనసేన బలంగా నిలబడిందని చెప్పుకొచ్చారు. కూటమిలో పార్టీల నేతల అలకలపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ విషయంలో అన్ని పార్టీలకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. అందరం ఏకాభిప్రాయానికి వచ్చి ఎన్నికలకు ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
తన డిపార్టుమెంటు నుంచి లక్షన్నర కోట్లు ఇచ్చామన్నారు. తాము ఎంత ఐక్యంగా ముందుకు వెళ్తున్నామో, దిగువ స్థాయి నాయకత్వం అదే విధంగా ముందుకు వెళ్లాలని సూచన చేశారు. కింద స్థాయిలో చూడాల్సిన పనులు కూడా సీఎం దృష్టికి వచ్చిందన్నారు.చాలా సమస్యలు వచ్చాయన్నారు. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు తుఫాను వచ్చిందన్నారు. ఈ సమయంలో సీట్ల సర్దుబాటు చూస్తూ, తుఫానుపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష చేస్తున్నారని వివరించారు. తాను జిల్లా కలెక్టర్లతో నిత్యం మాట్లాడుతూనే ఉన్నామని తెలిపారు. తుఫాను క్షేమంగా తీరం దాటాలని తాము కోరుకుంటున్నామని మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పాఠశాలలకు సెలవులు, విద్యుత్ ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్