Anil Ravipudi:తెలుగు బుల్లితెర వీక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతూ, అద్భుతమైన ప్రతిభను వెలికితీయడంలో బుల్లితెర షోలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న పాపులర్ సింగింగ్ షో ‘సరిగమప’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు గాయనీ గాయకులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ఒక క్రేజీ ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా, అందులో జడ్జ్ గా వ్యవహరిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..
జీ తెలుగులో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9:00 గంటలకు ప్రసారమయ్యే ‘సరిగమప’ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ షో ద్వారా ఎంతోమంది కొత్త గాయకులు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. జడ్జిలుగా వ్యవహరిస్తున్న ప్రముఖులు (అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ) కంటెస్టెంట్లకు సరైన సూచనలు ఇస్తూ, వారి గాన నైపుణ్యాలను మరింత తీర్చిదిద్దుతున్నారు. ఇక దీంతో ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగాయి.
తాజాగా విడుదలైన ప్రోమోలో బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కంటెస్టెంట్లకు ఒక మైండ్ బ్లాకింగ్ సర్ప్‌రైజ్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానున్న తన కొత్త సినిమా జనవరి 12న విడుదల సినిమాలో పాట పాడే గోల్డెన్ ఛాన్స్‌ను ఈ షోలోని సింగర్స్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్లను తన సినిమాలో పాటలు పాడటానికి ఎంపిక చేసుకుంటున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆఫర్ విన్న కంటెస్టెంట్లు, జడ్జెస్ ఆనందంతో ఊగిపోయారు.
also read:హీరోయిన్ గా దేవయాని కూతురు.. హీరో ఎవరంటే?
ముగ్గురు సింగర్స్ ఎవరనే విషయాన్ని మేకర్స్ ఆసక్తికరంగా చూపించారు. సుధీర్ పేర్లు చెబుతుంటే, అనిల్ రావిపూడి గ్రీన్ లైట్ బటన్ నొక్కితే ఆ గాయకుడికి సినిమాలో పాడే ఛాన్స్ దక్కుతుందని చెప్పారు. ఇక అనిల్ బటన్ ప్రెస్ చేయడంతో ప్రోమో ముగిసింది. అసలు ఆ ముగ్గురు ఎవరనేది శనివారం ఎపిసోడ్‌లో వెల్లడికానుంది.
ఈ ప్రోమో కేవలం మ్యూజికల్ అనౌన్స్‌మెంట్‌తోనే కాకుండా బిగ్ డోస్ కామెడీతోనూ అలరించింది. లేడీ గెటప్స్, జడ్జ్ అవతారంలో జబర్దస్త్ ఇమ్మానుయేల్ చేసిన సందడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తానొక జడ్జ్ తరహాలో బిల్డప్ ఇస్తూ మ్యూజిషియన్స్ దగ్గరకు వెళ్లి వేసిన సెటైర్లు, పంచ్‌లు ఈ ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మొత్తానికి ‘సరిగమప’ కంటెస్టెంట్లకు అనిల్ రావిపూడి ఇచ్చిన ఈ ఆఫర్ వైరల్ అయింది. మరి ఆయన సినిమాలో పాట పాడే అవకాశం ఎవరికి వస్తుందనే ఉత్కంఠతో ప్రేక్షకులు శనివారం ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.