E-Paper
Advertisement

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మౌనం వీడడం లేదెందుకు? ఓ ప్రకటన కూడా విడుదల చేయలేకపోతున్నారా?

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మౌనం వీడడం లేదెందుకు? ఓ ప్రకటన కూడా విడుదల చేయలేకపోతున్నారా?
Advertisement

ఇరిగేషన్ ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ పార్టీ స్టాండ్‌గా ఏం మాట్లాడాలన్నా హరీశ్‌ రావే ముందుంటున్నాడు. కేటీఆర్‌ ‌కు ఈ అంశంపై అసలే పట్టులేదని ఆ పార్టీ నేతలే చెబుతారు. కానీ హరీశ్‌ మాటలు ఎవరూ వినేలా లేరు. తాజాగా తుమ్మిడిహట్టి రాష్ట్ర సర్కార్‌.. మహా సర్కార్‌తో జరిపిన చర్చలు సఫలీకృత సంకేతాలు వెలువరిచిన నేపథ్యంలో బీఆరెస్‌ దీనిపై విరుచుకుపడుతోంది.

ఈ పరిణామం ఎక్కడ రేవంత్‌ సర్కార్‌కు మైలేజీ తెచ్చుపెడుతుందోననే భయంతో పాటు.. మేడిగడ్డ వద్దకు బ్యారేజీ రీడిజైన్‌ అంశంలో తమను దోషిలా నిలిపే అవకాశం ఉందనే భయం కూడా ఆపార్టీని వెంటాడుతోంది. అందుకే నిన్న హరీశ్‌ హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి.. పొంతన లేని వాదనలు చేశాడు.

Advertisement

కడితే కట్టండి అని, 30వేల కోట్లని అంచనా వేశారు.. ఇది ఎంత వరకు పోతుందోనని, అసలు అక్కడ నీళ్లే లేవని, మేం ముందుగానే ప్రయత్నించామని.. ఇలా సర్కార్‌కు మైలేజీ ఏమాత్రం రావొద్దనే తపనే హరీశ్‌ మాటల్లో కనిపించింది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల కు గ్రావిటీ ద్వారా నీరొస్తే.. తాను రాజీనామాకు సిద్దమనే దాకా వెళ్లింది హరీశ్‌ ఫ్రస్ట్రేషన్.

కేసీఆర్ తన బర్త్‌డేను వదిలేసుకుని మరీ వచ్చి మహా సర్కార్‌తో చర్చలు జరిపారని గొప్పగా చెబుతున్న హరీశ్‌.. ఆ వెంటనే మహా సర్కార్‌ 152 మీటర్లకు ఒప్పుకోలేదని, అక్కడ నీళ్లే లేవని వితండవాదం చేసి పలుచనయ్యాడు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌దే అప్పర్‌ హ్యాండ్‌ అని కవితే స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ఆయన ఏం చెప్పినా జనం నమ్మేలా లేరు.

Advertisement

ఓవైపు ఎల్‌నినో కరువు తరుముకొస్తుందని సర్కార్‌ భయపెడుతున్న వేళ.. తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవని భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణంలోనే.. తుమ్మిడిహట్టి చర్చలు.. మహా సర్కార్‌ సానుకూల స్పందన.. బీఆరెస్‌కు మింగుడు పడలేదు. ఈ కరువుకు కాంగ్రెస్సే కారణమని నెపం నెట్టి జనం ముందు రేవంత్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న సందర్బంలో బీఆర్‌ఎస్‌కు పంటికింద రాయిలా తుమ్మిడిహట్టి అంశం వచ్చిపడినట్టయ్యింది.

ఇది తమను సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడేయకుండా ఉండేందుకు హరీశ్ ఎదురుదాడికి దిగుతున్నాడు. కరువు వేళనైనా అధినేత కేసీఆర్ మౌనం వీడరా? అనే చర్చ కూడా ఈ నేపథ్యంలోనే  మొదలైంది. మొన్నటిదాకా రాజకీయాలకు కావాలనే దూరం ఉంటున్నారని, అది వ్యూహంలో భాగమని అనుకున్నా.. మరి ఇంత విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ నోటి వెంట ఒక్క మాట కూడా ఎందుకు బయటకు రావడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

‘తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం వద్దే వద్దు.. కావాలనే మేం ఆ పాయింట్‌ ను మేడిగడ్డకు మార్చాం.. రీడిజైన్ చేశాం.. అని’ అసెంబ్లీలో దీనిపై చర్చకు కూడా రెడీ అయ్యాడు అప్పుడు కేసీఆర్‌. మేం దీనిపై ఇంకా ప్రిపేర్‌ కాలేదు.. అని ఉత్తమ్‌ అన్నందుకు.. ‘ప్రిపేర్‌ అయి రాకపోతే పీకనీకి వచ్చారా?’ అని అధికార దురహంకారాన్ని కూడా ప్రదర్శించాడాయన. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై, కరువు పరిస్థితులపై ఒక్క ప్రెస్‌నోట్ కూడా విడుదల చేసేంత తీరిక లేదా? అని నిలదీస్తున్నారు ఆ పార్టీ నేతలే.

హరీశ్‌ ఎన్ని చెప్పినా.. ఎవరూ వినేలా లేరు. జనం చావని, మళ్లీ ఎన్నికలప్పుడే వచ్చి రాజకీయాలు చేస్తా.. అనే విధంగా ఉన్నఅధినేత తీరుపై అసంతృప్తి మరింత పెరుగుతుంది పార్టీలో. ప్రజల్లో.

Tags

Related News

మొన్నటిదాకా మేం ప్రయత్నం చేసినం.. సాధ్యమే కాలేదన్న హరీశ్‌! అక్కడ నీళ్లే లేవు.. అందుకే మేడిగడ్డకు మార్చామని వాదన!

2016 ఒప్పందంలో బిగ్ మిస్టెక్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ అసలు రూట్ మ్యాప్ ఇదే?

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కేటీఆర్ సంచలన ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

Big Stories

Advertisement
×