BigTV English

CM Chandrababu: సీఎం చంద్రబాబు ప్రకటన.. ఏపీకి మరో 20 పోర్టులు, అలాగే బుల్లెట్ ట్రైన్‌పై కూడా

CM Chandrababu: సీఎం చంద్రబాబు ప్రకటన.. ఏపీకి మరో 20 పోర్టులు, అలాగే బుల్లెట్ ట్రైన్‌పై కూడా

CM Chandrababu: కేంద్రం సహకారంలో ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో ఏపీలో 20 పోర్టులను నిర్మిస్తామని ప్రటన చేశారు. ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్‌లను ఏపీకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.


కూటమి సర్కార్ ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందకు ఫోకస్ చేసింది. కేవలం కంపెనీలు రప్పించడమేకాదు వాటికి కావాల్సిన మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. భారీగా రోడ్లు  నిర్మించేందుకు పనులు ఓ వైపు జరుగుతున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్టులు, రవాణాకు అనుకూలంగా పోర్టులపై దృష్టి కేంద్రకృతమైంది.

ఏపీలో మరో 20 పోర్టులు నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. శనివారం రాత్రి మంగళగిరిలో జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తర్వాత అత్యంత సముద్రం ఉన్న ప్రాంతం ఏపీ అని అన్నారు. ఏపీలో నదులు, కాలువలు ఎక్కువగా ఉన్నాయని, మరిన్ని పోర్టులు నిర్మిస్తామన్నారు.


ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్‌లను ఏపీకి కేరాఫ్‌గా మారుతుందని మనసులోని మాట బయటపెట్టారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో 20 పోర్టులను తయారు చేసే బాధ్యత కూటమి సర్కార్ తీసుకుంటుందన్నారు.

ALSO READ: అప్పుడో లెక్క.. ఇప్పుడూ లెక్క.. బాబులో వచ్చిన మార్పులివే

రాష్ట్రంలో రూ.70వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో సుమారు రూ.11వేల కోట్లతో 760 కిలోమీటర్ల రోడ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. రహదారులకు భూసేకరణ విషయంలో ఎలాంటి సమస్య ఉండదంటూ కేంద్రమంత్రి గడ్కరీకి ఏపీ తరఫున హామీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఏపీలో ఏడు ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, వచ్చే ఆగష్టు నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు మొదలవుతుందన్నారు. కొత్తగా తొమ్మిది ఎయిర్‌పోర్టులు రావాల్సి ఉందన్నారు. కేవలం గంటలో విమానాశ్రయానికి, పోర్టులకు వెళ్లేలా రోడ్లు నెట్‌వర్క్‌ ఉంటేనే ఏపీ లాజిస్టిక్‌ హబ్‌గా మారుతుందన్నారు.

ఏపీకి బుల్లెట్ రైలు ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అహ్మదాబాద్‌ – ముంబైకి బుల్లెట్‌ రైలు వస్తోందన్నారు. దక్షిణ భారతంలో అలాంటి రైలు అమరావతి-చెన్నై- హైదరాబాద్-బెంగళూరు కవర్‌ చేస్తే 5 కోట్ల మందికి కనెక్ట్ అవుతుందన్నారు. నాలుగు రాజధానుల కనెక్టుతో అతి పెద్ద ఆర్థిక కారిడార్ అవుతుందన్నారు.

గతేడాది అక్టోబర్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీలో ఏపీకి బుల్లెట్ రైలు ప్రతిపాదనను సీఎం చంద్రబాబు తెచ్చారు. మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. రానున్న బడ్జెట్‌లో బుల్లెట్ రైలుపై ప్రకటన వచ్చే అవకాశముందని కూటమి నేతలు భావిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రకటన రావచ్చని అంటున్నారు.

Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×