Intinti Ramayanam Today Episode August 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి నిర్ణయాన్ని అందరూ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పార్వతీ మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది తన కన్న కూతురు తన మాట వినలేదని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.. తల్లి బాధను చూసి అక్కడికి వచ్చిన అక్షయ్.. తనకి మాటిస్తాడు. నీ మాట ప్రకారమే నేను నువ్వు కోరుకున్న వాడితో చెల్లి పెళ్లి చేసేలా చేస్తాను అని మాటిస్తాడు. అక్షయ్ అవని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.. అవని దగ్గరకు వెళ్లినా అక్షయ్ వాళ్లకి ఫేవర్ గా మాట్లాడుతాడు. పెళ్లి గురించి మీకు ముందే చెబుదామని అనుకున్నాను అని అవని అంటుంది. వాళ్ళ అమ్మ ప్లాన్ ప్రకారం అక్షయ్ వచ్చాడన్న విషయం తెలియక వాళ్ళు అక్షయ్ ని నమ్ముతారు. ప్రణతి అన్నయ్య ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య అంత ధైర్యం ఇచ్చిన తర్వాత నేను ఇంక భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. అక్షయ్ అసలు ప్లాన్ తెలియక అవని కూడా నిజమే అని నమ్ముతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ప్రణతి పెళ్లి గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని పల్లవి పార్వతికి చెప్తుంది. ఇక అక్షయ్ కు పార్వతికి ఫోన్ చేసి వాళ్లు నమ్మారు అన్న విషయాన్ని చెప్తాడు.. వాళ్లు ఇప్పుడే ప్రణతికి పెళ్లి చేయకుండా ఒక విషయం చెప్పానమ్మా అని అక్షయ్ అంటాడు. ఏంట్రా అది అని అడుగుతుంది. ముందు భరత్ కి జాబ్ తెచ్చుకోమని చెప్పండి తర్వాతే పెళ్లి చేస్తాము అని చెప్పాను. నీకు ఇంకా టైం ఉంది కదా అమ్మ నువ్వేం భయపడకు నీకు నచ్చిన అబ్బాయి తోనే నువ్వు పెళ్లి చేద్దువు అనేసి భరోసా ఇస్తాడు.. పార్వతి అక్షయ్ మాట చెప్పగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.
కానీ పల్లవి మాత్రం మరో ఫిట్టింగ్ పెడుతుంది. మీరంతా ఏడుస్తూ ఉంటేనే నేను సంతోషంగా ఉంటాము అని అనుకుంటుంది. పల్లవి మాత్రం బావగారి అలా చెప్పినా కూడా ప్రణతినీ అంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఇక్కడికి తీసుకురావాలి అని అడుగుతుంది.. పార్వతి పల్లవి చెప్పిన విషయాన్ని ఆలోచిస్తుంది. అటు అక్షయ్ వాళ్ళమ్మ చెప్పిన మాటని ఎలా తీసుకోవాలి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే అమ్మ సంతోషంగా ఉండేలా చేయాలని ఆలోచిస్తాడు.
పార్వతి కూడా ప్రణతిని తొందరగా ఇంటికి తీసుకొని వస్తే బాగుంటుంది అని అనుకుంటుంది. చక్రధరకు ఆ పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి ఈ సంబంధం ఇంకా పోయినట్లే కదా అని అడుగుతారు. అలా ఏమనుకోకండి కొద్ది రోజులు వెయిట్ చేయండి కచ్చితంగా సంబంధం మీదే అని అంటారు. మీరు చెప్తున్నారు కాబట్టి మేము ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తామని వాళ్ళు చెప్తారు. చక్రధర్ వాళ్ళతో ఫోన్ మాట్లాడటం విన్న రాజేశ్వరి గొడవకు దిగుతుంది. ప్రణతికి పెళ్లి సంబంధం చూసింది మీరేనా అని అడుగుతుంది.
దానికి చక్రధర్ అవును నేనే చూశాను అని అంటాడు. ప్రేమించుకున్న వాళ్ళని విడగొట్టాలని మీకు ఎలా అనిపించింది అని అడుగుతుంది రాజేశ్వరి. మనము కూడా ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాము. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి అని అంటుంది. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఊర్లో వాళ్ళందరినీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకోను కదా అంటాడు చక్రధర్. అయినా సరే ప్రణతి నా మేనకోడలు దాని సంతోషంగా ఉంచడం నా బాధ్యత. మీరు ఎందుకు తనని ఇంకా బాధపడేలా చేస్తున్నారు అని రాజేశ్వరి కడిగిపడిస్తుంది. దానికి చక్రధర్ నేనేమీ కావాలని ఈ సంబంధం తీసుకురాలేదు.
ప్రణతి నీకు మాత్రమే కాదు నాకు కూడా చెల్లెలు కూతురు బావ కూతురు. వాళ్ళ అమ్మే నాకు ఫోన్ చేసి మంచి సంబంధం చూడండి అన్నయ్య అని అడిగితేనే నేను చూశాను ఊరికి ఏం చూడలేదు అని అంటారు. ఏది ఏమైనా సరే ప్రణతి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని రాజేశ్వరి అంటుంది. ప్రణతికి నచ్చిన వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది అని రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్రధర్ అది జరిగితే ఇక మజా ఏముంటుంది అని ఆలోచిస్తాడు.
Also Read: రోహిణి మెడకు కొత్త సమస్య.. మనోజ్ గర్ల్ ఫ్రెండ్ కోసం వేట..వర్కౌట్ అవుద్దా..?
అవని పాయసం చేసి రాజేంద్రప్రసాద్ దగ్గరికి తీసుకొస్తుంది. భోజనం చేశాక కాఫీలు టీలు వద్దమ్మా అని అడుగుతాడు. అయ్యో మావయ్య ఇది కాఫీ కాదు పాయసం తీసుకోండి అని అంటుంది. ఈ టైంలో పాయసం చేసావ్ ఏంటమ్మా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఆయన మన మాటకు విలువిచ్చాడు అందుకే ఈ స్వీట్ చేశాను అని అంటుంది. నాకెందుకు అనుమానంగా ఉంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఒకటో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..