BigTV English

AP CM Chandrababu Vision: అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క.. బాబులో వచ్చినమార్పులివే..

AP CM Chandrababu Vision: అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క.. బాబులో వచ్చినమార్పులివే..

AP CM Chandrababu Vision: నారా చంద్రబాబు నాయుడు.. ఎవరంటే అంతా ఠక్కున చెప్పే ఒకే ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ సీఎం. సీఎం అంటే.. చీఫ్ మినిస్టర్ అని మనకు తెలుసు. కానీ.. ఆ సీఎం అప్పుడప్పుడు కామన్ మ్యాన్‌లానూ మారిపోతున్నారు. ఒకప్పటి చంద్రబాబుకు.. ఇప్పుడు కనిపిస్తున్న చంద్రబాబుకు చాలా తేడా ఉంది. ప్రజాసేవే అసలైన రాజకీయం అని నమ్మిన నాయకుడు.. ఆ ప్రజలతోనే మమేకమవుతున్నారు. జనంలో ఉంటున్నారు. జనంలా ఉంటున్నారు. అసలు.. చంద్రబాబులో కొత్తగా వచ్చిన మార్పేంటో.. ఏపీ గమనిస్తోందా?


గతంలో ఎక్కువగా పరిపాలనలోనే బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పాలనా విధానంలోనే కాదు.. ప్రజలతో మమేకమయ్యే తీరు కూడా మారింది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు.. ఎక్కువగా పరిపాలనలోనే బిజీగా ఉండేవారు. ఆఫీసుకే పరిమితమయ్యేవారు. కానీ.. ఇప్పుడు బాబులో.. 2.0 వెర్షన్ కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజల మధ్యకే నేరుగా వెళ్తున్నారు. సీఎం అంటే సిన్సియర్‌గా పాలనపై దృష్టిపెట్టడమే కాదు.. అప్పుడప్పుడు సింపుల్‌గా ఇలా జనాలతో కనెక్ట్ అవడం కూడా అనే కొత్త ఒరవడికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.


సింప్లిసిటీ అంటే ఏమిటో చూపించిన సీఎం

ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఎప్పటిలా కాకుండా.. వినూత్నంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. భారీ వేదిక లేదు.. భారీ టెంట్లు లేవు.. కుర్చీలు లేవు.. దద్దరిల్లిపోయే సౌండ్ లేదు.. దిమ్మతిరిగిపోయే ఏర్పాట్లు లేవు. మండుటెండలో.. పంటల పొలాల మధ్యలో.. రైతన్నల సమక్షంలోనే.. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని.. ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. కల్లంలో ఏర్పాటు చేసిన మంచం మీదే కూర్చున్నారు. రైతులతో పాటే సింపుల్‌గా కుర్చీలో రిలాక్స్ అయ్యారు. సింప్లిసిటీ అంటే ఏమిటో.. ఈ ప్రోగ్రాంతో చూపించారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా రెట్టింపు సంక్షేమం అందుకున్న ప్రజలు సంతోషంగా ఉన్నారని.. ఇంతకంటే తనకు కావాల్సిందేముందని బాబు చెబుతున్న తీరు చూస్తుంటే.. ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని కష్టాలున్నా.. అవన్నీ తన వరకే పరిమితమని.. జనం సుఖ,సంతోషాలతో ఉండాలనేదే తన ఆకాంక్ష అని అంటున్నారు. రోజుకు ఒక్కసారైనా తనని తలుచుకుంటారా? అని జనాన్ని అడగడం కూడా కొత్తగా కనిపిస్తోంది. రాజకీయ నేతగా, సీఎంగా.. చంద్రబాబు రాజకీయ జీవితం ఎప్పుడూ విజన్, క్రమశిక్షణ, అభివృద్ధి అనే వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ.. నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా రెండోసారి అధికారం చేపట్టాక.. బాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పేదల సేవ అనే కార్యక్రమంతో.. జనంతో మమేకమై, వారి మధ్యే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పేదల సేవకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల మధ్యకు తీసుకెళ్తూ కొత్త ఒరవడి సృష్టించారు. ఈ మార్పు కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే నిజమైన సంకల్పానికి నిదర్శనం.

టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, ఆర్థిక వృద్ధిపైనే దృష్టి

నిజానికి చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా.. టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించిన నాయకుడిగానే కనిపించేవారు. అమరావతిని ఆధునిక రాజధానిగా రూపొందించే విజన్‌తో.. ఆయనెప్పుడూ బిజీగానే గడిపేవారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ ఏపీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు, పేదల సంక్షేమం చుట్టే తిరుగుతోంది. ఇటీవలే.. పీ4 పథకంలో భాగంగా.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో.. ఆయన కుటుంబం కూడా భాగస్వామ్యం కావడం విశేషం. ఇది.. చంద్రబాబులోని సామాజిక స్పృహని, నాయకత్వంలో సానుభూతిని ప్రతిబింబిస్తోంది. కడప జిల్లా గూడెం చెరువు గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గూడెంచెరువు గ్రామంలోని ఉల్సాల అలివేలమ్మ ఇంటికెళ్లి.. వారితో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులను తెలుసుకున్నారు. అలివేలమ్మకు వితంతు పెన్షన్‌ అందించారు. వారింట్లో ఉన్న చేనేత మగ్గాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి.. ఆటోలో సామాన్యుడిలా ప్రయాణించి.. ప్రజావేదిక దగ్గరకి చేరుకున్నారు. మార్గం మధ్యలో ఆటో డ్రైవర్ల ఇబ్బందుల గురించి, కూటమి ప్రభుత్వ పాలన గురించి ఆరా తీశారు.

నెలలో ఒక్కసారైనా ఇలా జనంలోకి చంద్రబాబు

సాధారణంగా ఫించన్ అందించాలంటే.. ఓ గ్రామ స్థాయి అధికారి వెళితే సరిపోతుంది. కానీ.. సీఎం చంద్రబాబే నేరుగా వెళ్లి ఫించన్ అందించడమే ఇప్పుడు సరికొత్తగా అనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల.. జనంలో సీఎం అంటే భరోసా పెరుగుతుంది. ఎప్పుడూ వార్తా పత్రికలు, టీవీల్లో కనిపించే ముఖ్యమంత్రి.. తమ ఇంటికి రావడంతో.. ఏవైనా సమస్యలుంటే నేరుగా ఆయనకే చెప్పుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వ పాలనపైనా తమ అభిప్రాయాన్ని నేరుగా సీఎంకే చెప్పే అవకాశం ఉంటుంది. తమ పాలనపై జనం ఏమనుకుంటున్నారనేది కూడా ముఖ్యమంత్రికి క్లియర్‌గా తెలుస్తుంది. అందుకోసమే.. నెలలో ఒకసారైనా ఇలా జనం మధ్యలోకి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. సాధారణంగా ఓ ముఖ్యమంత్రి.. గండికోట లాంటి టూరిస్ట్ స్పాట్‌ని సందర్శిస్తే.. చుట్టూ నాయకులు, అధికారులు.. హడావుడి.. ఆ సీనే వేరేలా ఉంటుంది. కానీ.. చంద్రబాబు గండికోట టూర్‌లో అలాంటివేవీ కనిపించలేదు. సీఎం సింపుల్‌గా కారు దిగి.. స్థానికంగా ఉండే గైడ్‌తోనూ, టూరిజం సిబ్బందితోనూ, స్థానికులతోనూ ముచ్చటించారు. టూరిస్టుల రాక, వసతుల గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టూరిజం పరంగా గండికోటను మరింత డెవలప్ చేసేందుకు.. ఏమేం వసతులు కల్పించాలి? ఎలాంటి ఏర్పాట్లు చేయాలని.. అక్కడున్న వాళ్లనే అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయంలో.. సింపుల్‌గా టూరిజం శాఖ అధికారులతో ఓ రివ్యూ చేసి.. అవసరమైన నిధులు మంజూరు చేస్తే అయిపోతుందనుకోలేదు బాబు. అక్కడికి వెళ్లి.. అక్కడున్న వాళ్లతో మాట్లాడిక.. ఏం కావాలో అడిగి తెలుసుకోవడమే.. ఇప్పుడు చంద్రబాబులో వచ్చి మార్పు. ఇదే.. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

చంద్రబాబు అంటే.. ప్రజలతో సన్నిహితంగా మెలిగే నాయకుడిగా కంటే.. ఓ విజనరీ అడ్మినిస్ట్రేటర్‌గానే గుర్తింపు ఎక్కువ. కానీ.. ఈ బాబు.. ఆ బాబు కాదు. ఇప్పుడంతా.. అప్‌డేటెడ్ పబ్లిక్ వెర్షన్. ప్రతి పథకాన్ని జనంలోకి వెళ్లి ప్రారంభిస్తున్నారు. జనానికే.. నేరుగా అందిస్తున్నారు. తమ ప్రభుత్వం వల్ల జరుగుతున్న మంచిని.. ప్రజలకే వివరిస్తున్నారు. చంద్రబాబులో ఇంతటి మార్పు ఎందుకొచ్చింది? దీని వెనుక రాజకీయ వ్యూహం దాగుందా?

జనం విషయంలో తెలుస్తున్న చంద్రబాబు చిత్తశుద్ధి!

ప్రజలు ఎన్నుకున్న నాయకుడు.. ప్రజా పాలనపై దృష్టి పెట్టడమే కాదు.. అప్పుడప్పుడు ప్రజలతోనూ కలిసిపోతున్నారు. సామాన్యులతో.. సామాన్యుడిలా మెలుగుతున్నారు సీఎం చంద్రబాబు. జనాన్ని నేరుగా కలిసేందుకు, వారి సమస్యల్ని వినేందుకు సమయం కేటాయిస్తున్నారు. ఈ మార్పు.. ఓ రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ.. జనం విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి కూడా స్పష్టంగా తెలుస్తోంది. సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు పాఠశాలలో టీచర్‌గా మారి.. విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారితో కలిసి.. మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల్ని నేరుగా కలిసి.. వారి స్పందనని తెలుసుకున్నారు. కుప్పంలో ఇంటింటికీ తిరిగి.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జనం సాధకబాధకాలు వింటూ ముందుకు సాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య ప్రజల ఇళ్లకు నేరుగా వెళ్లడం. వారి బాగోగులు తెలుసుకోవడం చేశారు. మలకపల్లిలో చర్మకారుడు పోశిబాబును స్వయంగా తన కారులో ఎక్కించుకున్నారు. తన కాన్వాయ్‌లో కామన్ మ్యాన్‌తో కలిసి ప్రయాణించారు. పోశిబాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. పోశిబాబు ఇంటికి వెళ్లి డప్పులు, చెప్పుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా.. చర్మకార పింఛను అందజేశారు.

పేదల సేవలో కార్యక్రమంతో జనంలోకి సీఎం చంద్రబాబు

పేదల సేవలో కార్యక్రమంతో.. మత్స్యకారులు, పారిశుద్ధ్య కార్మికులు, చేనేత కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, బైక్ మెకానిక్‌.. ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రజల మధ్యలో ఓ సామాన్యుడిగా కనిపిస్తూ, వారి ఆకాంక్షలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. గతంలో ఆయనపై వచ్చిన రాజకీయ విమర్శలను.. ఈ కొత్త విధానం ద్వారా సీఎం తిప్పికొడుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ముఖ్యంగా.. పీ4 లాంటి పథకాల ద్వారా పేదరిక నిర్మూలనుకు చంద్రబాబు చేస్తున్న కృషి.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ఈ కార్యక్రమాల వెనుక రాజకీయ వ్యూహం ఉన్నా.. లేకపోయినా.. రాష్ట్ర ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు.. చిత్తశుద్ధితో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయ్. పైగా.. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్‌ని.. తిరిగి అధికారంలోకి రానివ్వనని చంద్రబాబు ఘంటాపథంగా చెబుతున్నారు. అది నెరవేరాలంటే.. జనంతో కనెక్ట్ అవడమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని చంద్రబాబు భావించి ఉండొచ్చు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే బాబు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని.. బలంగా ఉండాలనే ఆలోచన కనిపిస్తోంది. జగన్‌ని అధికారంలోకి రానివ్వొద్దంటే.. జనంలోనే ఎక్కువగా ఉండాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Story By Anup, Bigtv

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×