BigTV English

OTT Movie : అబ్బాయిల గురించి అమ్మాయిలు ఇంత దారుణంగా… సింగిల్ కు ఎంజాయ్ పండగో

OTT Movie : అబ్బాయిల గురించి అమ్మాయిలు ఇంత దారుణంగా… సింగిల్ కు ఎంజాయ్ పండగో

OTT Movie : ఒక హాలీవుడ్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా టీనేజ్ అమ్మాయిల జీవితంలోని సాధారణ సమస్యలను సున్నితంగా చూపిస్తుంది. కానీ అడల్ట్ ఆడియన్స్‌ ని కూడా ఆకట్టుకుంటుంది. ఇది ఒక ఫీల్-గుడ్, లైట్-హార్టెడ్ డ్రామా. కుటుంబంతో చూడడానికి కూడా సరిపోతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Are You There God? It’s Me, Margaret’ ఒక అమెరికన్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా సినిమా. దీనికి కెల్లీ ఫ్రీమాన్ క్రెయిగ్ దర్శకత్వం వహించారు. ఇది జూడీ బ్లూమ్ 1970లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా 2023న ఏప్రిల్ 28, థియేటర్లలో విడుదలైంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో అబ్బీ రైడర్ ఫోర్ట్‌సన్, రాచెల్ మెక్‌ఆడమ్స్ , కాథీ బేట్స్ , బెన్నీ సఫ్డీ, ఎల్లే గ్రాహం, ఐసోల్ యంగ్, కేథరిన్ కుప్ఫెరర్ నటించారు. ఈ సినిమా 106 నిమిషాల నిడివితో, రాటెన్ టొమాటోస్‌లో 99%, IMDbలో 7.3/10 రేటింగ్ ను పొందింది.


స్టోరీలోకి వెళితే

మార్గరెట్ సైమన్ ఒక 11 ఏళ్ల అమ్మాయి, 1970లలో న్యూయార్క్ సిటీలో తన తల్లిదండ్రులు బార్బరా, హెర్బ్ తో కలసి జీవిస్తుంటుంది. ఆమె కుటుంబం ఉద్యోగరీత్యా న్యూజెర్సీలోని ఒక సబర్బ్‌కు మారుతుంది. దీంతో మార్గరెట్ తన స్నేహితులను, నగర జీవితాన్ని వదిలి కొత్త పరిసరాలకు అలవాటు పడాల్సి వస్తుంది. ఆమె తన బామ్మ సిల్వియాతో చనువుగా ఉంటుంది. ఇక మార్గరెట్ కొత్త స్కూల్ లో నాన్సీ అనే అమ్మాయితో స్నేహం చేస్తుంది. ఆమె నడిపే ఒక సీక్రెట్ క్లబ్‌లో చేరుతుంది. ఈ క్లబ్‌లో టీనేజ్ అమ్మాయిల సమస్యల గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ మరీ ఓపెన్ గా వయసులో వచ్చే మార్పులగురించి, బాయ్ ఫ్రెండ్స్ గురించి చర్చించుకుంటూ ఉంటారు.

Read Also : 1300 కోట్ల కోసం ఒక్క రాత్రిలో విధ్వంసం… ఐదుగురి జీవితాలు బలి… ఈ మూవీని చూశాక జన్మలో లాటరీ టికెట్ జోలికెళ్లరు

మార్గరెట్ తండ్రి ఒక యూదు, తల్లి ఒక క్రిస్టియన్. కానీ వాళ్లు ఆమెను ఏ మతంలోనూ పెంచలేదు. ఆమె ఒక స్కూల్ ప్రాజెక్ట్ కోసం క్రిస్టియన్ చర్చ్‌లు, యూదు సినగాగ్‌లను సందర్శిస్తుంది. దేవుడితో తన జీవితంలో జరిగే విషయాలను చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె తన తల్లిదండ్రుల మత విషయంలో వచ్చిన గొడవల గురించి కూడా తెలుసుకుంటుంది. మార్గరెట్ జీవితంలో స్నేహం, క్రష్‌లు, కుటుంబ సమస్యలు కలిసి ఆమెను ఒక ఆత్మవిశ్వాసం గల యువతిగా మారుస్తాయి. ఆమె వయసులో వచ్చిన మార్పులకు దేవుడికి థాంక్స్ చెబుతుంది. ఇక చివరలో ఆమె తన తల్లితో కలిసి బామ్మ సిల్వియాతో సమయం గడుపుతూ తన కొత్త జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ స్టోరీ సాధారణంగా అనిపించినా ఒక ఫీల్ గుడ్ మెమొరీని ఇస్తుంది.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×