E-Paper
Advertisement

CM Chandrababu: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. సీఎం కీలక నిర్ణయం

CM Chandrababu: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. సీఎం కీలక నిర్ణయం
Advertisement

CM Chandrababu: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చనున్నట్లు సచివాలంయంలో కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఇకపై స్వర్ణగ్రామంగా మారుస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిపాలనా సంస్కరణలపై సీఎం చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు.

Advertisement

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ ను సూపర్ సక్సెస్ చేశాం అని సీఎం పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్లను ప్రతి నెలా మొదటి తేదీనే లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ.14 వేల చొప్పున అందించామని చెప్పారు. పేదలకు మరింత చేయూత అందించేందుకు పీ4 విధానంను తీసుకొచ్చామని వివరించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిరంతరం కొత్త విషయాలు తెలుసుకుంటూ, మార్పులకు అనుగుణంగా పని చేయాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం లభించాలన్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని, లోటుపాట్లను సరిదిద్దుకుంటేనే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వచ్చిన విమర్శలకు సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ కళాశాలల పేరుతోనే కొనసాగుతాయని చెప్పారు. వాటికి సంబంధించిన నిబంధనలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ కాలేజీల్లో 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా ఉంటాయని, 70 శాతం మందికి ఎన్‌టీఆర్ వైద్య సేవలు అందుతాయని చెప్పారు. సీట్ల సంఖ్య కూడా పెరిగిందని వెల్లడించారు.

విమర్శలు చేసే వారు వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృథా చేశారని విమర్శించారు. ఆ నిధులు ఉంటే ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలు నిర్మించి ఉండేవాళ్లమని వ్యాఖ్యానించారు.

వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధిస్తున్న త్రైమాసిక ఫలితాలను విద్యార్థి పరీక్ష ఫలితాల్లా ఎదురు చూస్తానని అన్నారు. అధికారులంతా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలని సూచించారు. గత రెండు త్రైమాసికాల్లో మంచి ఫలితాలు సాధించామని, ఈసారి వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా పెట్టుకున్నామని తెలిపారు. మొత్తం 17 వర్టికల్స్‌లో ఫలితాలు సాధిస్తేనే జీఎస్డీపీ పెరుగుతుందని స్పష్టం చేశారు.

లైవ్ స్టాక్, మాన్యుఫాక్చరింగ్, ఫిషింగ్ వంటి రంగాల్లో మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్లకు సూచించారు. వ్యవసాయ రంగం డిమాండ్ డ్రివెన్‌గా ఉండాలన్నారు. జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక కీలకమని, జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.

Also Read: జగన్ ఏమైనా చేసుకో.. నేను అస్సలు భయపడను!

అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు చేయూత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి యూనిట్, ప్రతి శాఖలో సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ప్రగతిలో, అధికారుల పనితీరులో క్వాంటమ్ ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలన్నది తన ఆశయమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Related News

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×